ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధూ

టోక్యో ఒలింపిక్స్ లో తెలుగుతేజం మెరిసింది. మరోసారి ఆశలను సజీవం చేసింది. పతకం దక్కించుకుని తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఒక దశలో పతకం రాదేమోనన్న నిరాశలో ఉన్న సగటు పౌరుల్లో ఉత్సాహం నింపింది. అనుకోని విధంగా పతకం దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఒలింపిక్స్ లో మహిళల బ్యాట్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో […]

Written By: Srinivas, Updated On : August 1, 2021 7:09 pm
Follow us on

టోక్యో ఒలింపిక్స్ లో తెలుగుతేజం మెరిసింది. మరోసారి ఆశలను సజీవం చేసింది. పతకం దక్కించుకుని తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఒక దశలో పతకం రాదేమోనన్న నిరాశలో ఉన్న సగటు పౌరుల్లో ఉత్సాహం నింపింది. అనుకోని విధంగా పతకం దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఒలింపిక్స్ లో మహిళల బ్యాట్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది.

వరుస గేమ్స్లో 21-13, 21-15 తేడాతో విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో రెండో పతకం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన సింధు తాజా ఒలింపిక్స్ లో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం జరిగిన సెమీఫైనల్ పోరులో చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమి పాలైంది. ఇక ఆదివారం కాంస్యం కోసం జరిగిన మరో పోరులో బింగ్జియావోపై సింధు ఘన విజయం సాధించడంతో వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారతీయ బ్యాట్మింటన్ క్రీడాకారిణిగా సింధు రికార్డు నెలకొల్పింది.

ఈ మ్యాచ్ లో సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి గేమ్ లో విరామ సమయానికి 11-8తో నిలిచిన భారత షట్లర్ తరువాత మరింత దూకుడుగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ చైనా క్రీడాకారిణిని ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలో తొలి గేమ్ ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో పతకంపై ఆశలు సజీవం చేసుకుని విజయం సాధించింది.

ఇక రెండో గేమ్ ప్రారంభమైనప్పుడు కూడా సింధూనే దూకుడు ప్రదర్శించింది. మధ్యలో బింగ్జియావో గట్టిగా పోరాడేందుకు చూసినా సింధు ఆధిక్యంలోకి వెళ్లనివ్వలేదు. దీంతో విరామ సమయానికి మళ్లీ 11-8 తో నిలిచింది. ఈ క్రమంలోనే చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో తెలుగు తేజం 21-15తో విజయం సాధించింది. దీంతో వరుసగా రెండు ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సాధించింది.