ఇంగ్లండ్ తో మూడోవన్డేకు ప్రక్షాళన.. టీమిండియాలో మార్పులివీ

ఇంగ్లండ్ తో చిట్టచివరి సిరీస్ ముగిసే మూడో వన్డే రేపు హోలీ పండుగ సందర్భంగా జరుగబోతోంది. రెండో వన్డేలో 337 పరుగులు చేసినా ఓడిపోవడం టీమిండియా వంతైంది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ భారత బౌలింగ్ ను ఊచకోత కోశారు. బుమ్రా, షమీ , జడేజా లాంటి క్లాసు బౌలర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో చివరిదైన మూడో వన్డేలో బౌలింగ్ విభాగాన్ని టీమిండియా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. భారీగా పరుగులు ఇచ్చిన కుల్ దీప్ పై […]

Written By: NARESH, Updated On : March 27, 2021 6:52 pm
Follow us on

ఇంగ్లండ్ తో చిట్టచివరి సిరీస్ ముగిసే మూడో వన్డే రేపు హోలీ పండుగ సందర్భంగా జరుగబోతోంది. రెండో వన్డేలో 337 పరుగులు చేసినా ఓడిపోవడం టీమిండియా వంతైంది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ భారత బౌలింగ్ ను ఊచకోత కోశారు. బుమ్రా, షమీ , జడేజా లాంటి క్లాసు బౌలర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది.

దీంతో చివరిదైన మూడో వన్డేలో బౌలింగ్ విభాగాన్ని టీమిండియా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. భారీగా పరుగులు ఇచ్చిన కుల్ దీప్ పై వేటు పడనుంది. ఫామ్ లో లేనప్పటికీ యజ్వేంద్ర చాహల్ నే నమ్ముకోనుంది. ఇక కృనాల్ 6 ఓవర్లలోనే 72 పరుగులు ఇచ్చిన కృణాల్ దీ అదే పరిస్థితి.

వికెట్లు తీయడంతోపాటు పరుగులు చేసే వాషింగ్టన్ సుందర్ పై కోహ్లీ మెగ్గు చూపుతాడు. భువి, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ దాడి కొనసాగిస్తారు. శార్దుల్ బదులు ఎడమచేతి వాటం నటరాజన్ లేదా హైదరాబాద్ సిరాజ్ ను తీసుకోవచ్చు. పనిభారం పర్యవేక్షణ అంటూ హార్ధిక్ కు బంతినివ్వకపోవడంతో అదనపు బౌలర్ సేవలు అందడం లేదు.

భారత బ్యాటింగ్ లైనప్ బాగున్నా వ్యూహం మార్చాల్సిన అవసరం వచ్చింది.. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కంఫర్ట్ జోన్ వదిలేసి ఆడాలి.. అదిరే ఆరంభాలు ఇవ్వాలి. వరుసగా అర్థ శతకాలు చేస్తున్న కెప్టెన్ కోహ్లీ నుంచి అభిమానులు శతకాలు ఆశిస్తున్నారు. కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రావడం టీంకు బలాన్ని ఇస్తోంది. రిషబ్ పంత్ బాగా ఆడుతున్నాడు. హార్ధిక్ చెలరేగడం జట్టుకు అవసరం.

ఇక ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ విధ్వంసకరంగా ఆడుతున్నారు. రాయ్, బెయిర్ స్టో, స్టోక్స్ లో దుమ్మురేపుతున్నారు. మోర్గాన్ లేనప్పటికీ లియామ్ లివింగ్ స్టన్ ఛేదనలో రెచ్చిపోయాడు.