Rohit Sharma: తప్పు చేస్తే తిట్టే కెప్టెన్ కాదు, ప్రేమగా హగ్ ఇచ్చే కెప్టెన్ హిట్ మ్యాన్…

యంగ్ ప్లేయర్లలందరిని ఎంకరేజ్ చేసుకుంటూ టీమ్ కు విజయాలు అందించడంలో రోహిత్ శర్మ అగ్రేసివ్ రోల్ పోషిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇండియన్ టీమ్ మాజీ బౌలర్ అయిన 'ప్రవీణ్ కుమార్' రీసెంట్ గా...

Written By: Gopi, Updated On : March 5, 2024 10:37 am

Praveen Kumar About Rohit Sharma Captaincy

Follow us on

Rohit Sharma: ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ లా సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే 3-1 తేడాతో ఇండియన్ టీమ్ ఈ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తన ఖాతాలో మరొక సిరీస్ ని వేసుకున్నాడు. ఇక టెస్ట్ సిరీస్ లో ఇండియన్ టీం నెంబర్ వన్ పొజిషన్ కి చేరడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర వహించాడనే చెప్పాలి.

తన చుట్టూ ఉన్న యంగ్ ప్లేయర్లలందరిని ఎంకరేజ్ చేసుకుంటూ టీమ్ కు విజయాలు అందించడంలో రోహిత్ శర్మ అగ్రేసివ్ రోల్ పోషిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇండియన్ టీమ్ మాజీ బౌలర్ అయిన ‘ప్రవీణ్ కుమార్'(Praveen Kumar) రీసెంట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘రోహిత్ శర్మ ‘ గురించి మాట్లాడుతూ ఆయన పైన ప్రశంశల వర్షం కురిపించాడు…రోహిత్ శర్మ ఒక అత్యుత్తమమైన బ్యాట్స్ మెన్ ఆయన గ్రౌండ్ లో ఉన్నంతసేపు బౌలర్ లందరికీ ఒక చిన్నపాటి భయం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన సారధ్యంలో ఆడుతున్న ఇండియన్ టీమ్ చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది.

గ్రౌండ్ లో ఎవరైనా ప్లేయర్స్ తప్పు చేస్తే వాళ్లను ఏమీ అనకుండా తన స్టైల్లో వాళ్ళకి ఒక హగ్ ఇస్తాడు. ఇక అలాంటి ఒక గొప్ప వైఖరి కలిగిన రోహిత్ శర్మ ఇండియన్ టీమ్ ను ముందుండి నడిపించడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు అంటూ తన మనసులోని మాటలు చెప్పాడు. అలాగే ఐపీఎల్ ప్రస్తావన కూడా తీసుకొస్తూ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఇప్పటివరకు ఐదు సార్లు ట్రోఫీ ని అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

అలాంటి రోహిత్ శర్మ తో కనీస మంతనాలు కూడా జరపకుండా ముంబై ఇండియన్స్ టీం అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడం అనేది సరైన విషయం కాదేమో, ఎప్పుడైతే టీమ్ కి రోహిత్ శర్మ కాకుండా హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమిస్తున్నాం అని టీమ్ యాజమాన్యం అనౌన్స్ చేసిందో , అప్పటినుంచి ముంబై ఇండియన్స్ టీమ్ పైన తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది. కానీ రోహిత్ శర్మ కెప్టెన్ గా అయిన, ప్లేయర్ గా అయిన తన బాధ్యతలు ఏంటో తనకు తెలుసు… మ్యాచ్ గెలవడం కోసమే టీమ్ ని ముందుండి నడిపించాలనుకుంటాడు. ఇక ప్లేయర్ గా అయితే భారీ పరుగులు చేస్తూ టీమ్ కి మంచి విజయాలను అందిస్తాడు… అంటూ రోహిత్ శర్మ పైన ప్రశంశల జల్లు కురిపించాడు…