Food For Delivery Woman: బాలింతలకు బలాన్నిచ్చే గింజలు ఏంటో తెలుసా..!!

డెలివరీ అయిన తరువాత మహిళలు త్వరగా కోలుకోవడానికి ఆలివ్ గింజలు ఎంతగానో సహాయ పడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ గింజలను హలీమ్ లేదా గార్డెన్ క్రెస్ సీడ్స్ అని పిలుస్తుంటారు.

Written By: Swathi Chilukuri, Updated On : March 5, 2024 10:48 am

Food For Delivery Woman

Follow us on

Food For Delivery Woman: సాధారణంగా డెలివరీ అయిన తరువాత మహిళల్లో చాలా మార్పులు వస్తుంటాయి. మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అంతేకాకుండా నీరసం, బరువు పెరగడం మరియు జుట్టు ఊడిపోవడం వంటి పలు రకాల సమస్యలతో బాధ పడుతుంటారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి బాలింతలకు ఈ గింజలు చాలా ఉపయోగకరం. ఇంతకీ ఆ గింజలు ఏంటి? ఎలా తీసుకోవాలనే విషయాలను మనం తెలుసుకుందాం.

డెలివరీ అయిన తరువాత మహిళలు త్వరగా కోలుకోవడానికి ఆలివ్ గింజలు ఎంతగానో సహాయ పడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ గింజలను హలీమ్ లేదా గార్డెన్ క్రెస్ సీడ్స్ అని పిలుస్తుంటారు. చిన్నగా, ఎర్రని రంగులో ఉండే ఈ ఆలివ్ గింజలను మితంగా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్ గింజలలో ఐరన్, విటమిన్ సి, ఈ, ఎ, ఫైబర్, ఫోలేట్ మరియు ప్రోటీన్ వంటి పలు పోషకాలు అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఎంతో పని చేసే ఆలివ్ గింజలు రక్తలేమి సమస్యను కూడా దూరం చేస్తుంది. ప్రతి రోజూ ఆలివ్ లడ్డూ తినడం వలన మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయి మెరుగుపడుతుంది.

తల్లి అయిన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి ఆలివ్ గింజలు బాగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. బాలింతలతో పాటు యుక్త వయసుకు చేరువలో ఉన్న అమ్మాయిలు కూడా వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆలివ్ గింజల్లో పాలు లేదా కొబ్బరి- నెయ్యితో కలిపి తీసుకోవడం వలన మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు దూరం అవుతాయి. అదేవిధంగా సంతానోత్పత్తికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.