‘Today horoscope in Telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సూర్యుడు మేష రాశిలో ఉండడం వల్ల ఆదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో చాలా రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వ్యాపారులకు లాభాలు రానున్నాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సీనియర్ల నుంచి మద్దతు లభించడంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులకు ప్రత్యర్థిల బెడద ఉంటుంది. అందువల్ల కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. కొత్తగా పెట్టుబడును పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. లక్ష్యాలను పూర్తి చేయడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. అయితే ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అనుకోకుండా పర్యటనలు ఉంటాయి. వి విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆదాయం పెరుగుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా ఆదాయ వనరులు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు ఉంటాయి. దీంతో ఆదాయం తగ్గిపోతుంది. వ్యాపారులు శత్రువులపై ఆధిపత్యాన్ని చలాయిస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసేవారు సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఇతరుల వద్ద అప్పు తీసుకోవాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనిని తిరిగి చెల్లించేందుకు కష్టమవుతుంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. విదేశాల నుంచి విశారకరమైన వార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఆందోళన వాతావరణం ఏర్పడుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు అదనపు ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విరోధ కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. శారీరక బాధలు కలిగే అవకాశం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారాలు చేసే కొన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఈ పర్యటనలు కాస్త అశాంతిని కలిగిస్తాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు సామాజిక సేవలో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపారులు అనుకోకుండా లాభాలు పొందుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. అదరపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులు ప్రణాళిక ప్రకారం గా ముందుకు వెళ్తారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని పనుల వల్ల మదన పడుతూ ఉంటారు. వ్యాపారులకు శత్రువులు అడ్డంకులు ఏర్పరుస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఒకరి ప్రవర్తన మనసుకు ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి విచారకరమైన వార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొన్ని మార్పులు చేసుకుంటారు. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం బలహీనంగా మారే అవకాశం ఉంది. అనుకోకుండా వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు పెండింగ్లో పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈ రాశి వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తీర్థయాత్రలు చేయాల్సివస్తుంది. డబ్బు సంపాదించడం సులభంగా మారుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు వాహనాలపై వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. చట్టపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులు జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.