The White Lotus Season 3 Review: హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకు సీరీస్ లకు చాలా మంచి ఆదరణ అయితే ఉంటుంది…ఇక ‘ద వైట్ లోటస్’ అనే సీరీస్ గతం లో రెండు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి… దాంతో ఇప్పుడు సీజన్ 3 మీద భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి ఈ సీరీస్ ‘జియో హిట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతుంది…మరి ఈ సీజన్ ఎలా ఉంది గత రెండు సీజన్ ల కంటే బాగుందా? ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..?
కథ
ముందుగా ఈ సీరీస్ కథ విషయానికి వస్తే ఒక రిసార్ట్ లో ఉన్న కొంతమంది చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ల లైఫ్ ను గడుపుతూ ఉంటారు…ఇక సడన్ గా స్విమ్మింగ్ ఫుల్ లో ఒక శవం కనిపిస్తుంది…ఆ వ్యక్తిని మర్డర్ చేసింది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది.ఇంతకీ ఈ మర్డర్ ఎవరు చేశారు అనేది తెలియాలంటే మీరు ఈ సీరీస్ చూడాల్సింది…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ‘మైక్ రన్నర్’ ఈ సీరీస్ ను చాలా ఇంట్రెస్టింగ్ తీశాడు. ప్రతి సీన్ లో కథ కి సంభందించిన ఏదోకటి చెప్పాలనే ప్రయత్నమైతే చేశాడు… మరి మొత్తానికైతే ఈ సీరీస్ ను కామెడీ వే లో తెరకెక్కించారు అందుకే ఈ సీరీస్ చూసిన ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుంది. అలాగే ఈ సీరీస్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ను బాగా వాడుకున్నారు. ఇక ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తు సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. మరి ఇలాంటి సందర్భంలోనే సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకుడిని ఈ సీరీస్ తో కనెక్ట్ చేసే ప్రయత్నమైతే చేశాడు.
ఇక స్క్రీన్ ప్లే లో కూడా చాలా టెక్నిక్స్ ను వాడుతూ ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కట్టిపడేసాడు… అందుకే ఈ సీరీస్ లో ఒక సోల్ అయితే ఉంది అదే సీరీస్ ను బతికించింది…ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ‘లేసిలి బిబ్’పోషించిన పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. తను ఎక్కడ కూడా క్యారెక్టర్ నుంచి డివియేట్ అవ్వకుండా చాలా చక్కగా నటించి మెప్పించాడు…ఇక తన తోటి నటులకు కూడా ఆయన పాత్ర తో కనెక్ట్ అయి నటించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది…
అందువల్లే మిగతా ఆర్టిస్టులు ‘క్యారి కూన్’, ‘వాల్టన్ గూగిస్’ లాంటి నటులు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా కొన్ని హరిబుల్ ఎలిమెంట్స్ లో డిఫరెంట్ షాట్స్ ను వాడాడు…అందువల్లే సీన్స్ నెక్స్ట్ లెవల్లో వచ్చాయి…ఇక మ్యూజిక్ కూడా చాలా వరకు ఓకే అనిపించింది…
ప్లస్ పాయింట్స్
విజువల్స్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్
ఇంట్రడక్షన్ కొంచెం స్లో గా స్టార్ట్ అయింది…