PBKS Vs RCB IPL 2025: ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. ఇక టెక్నాలజీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందువల్లే క్రికెట్లోని ప్రతిక్షణం కూడా మనకు కొత్తగా కనిపిస్తోంది. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్నది కాబట్టి.. అందులోని ప్రతిక్షణాన్ని సరికొత్తగా చూపించడానికి ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఏకంగా అత్యంత అధునాతన కెమెరాలను ఉపయోగిస్తోంది. దీంతో అభిమానులకు క్రికెట్ మజా మరింత కొత్తగా లభిస్తోంది. టాస్ వేసే ప్రక్రియ.. ఆటగాలను రకరకాల కోణాలలో ఫోటోలు తీసే ప్రక్రియ.. వంటి వాటికోసం ఐపీఎల్ నిర్వాహక కమిటీ రోబోలను వినియోగిస్తోంది. అయితే క్రికెట్లో అప్పుడప్పుడు సంచలనాలు చోటుచేసుకుంటాయి. నాటి సంచలనాలను గుర్తు చేస్తూ అటువంటి సంఘటనలే జరుగుతుంటాయి. ఇప్పుడు ఇటువంటిదే ప్రస్తుత ఐపీఎల్ లో జరిగింది. దీంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది.
Also Read: నితీష్ భాయ్.. ఇదా ఆట.. ఇదేనా నీ ఆట..
ఒకే స్కోరు.. ఒకే రిజల్ట్
శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి. బెంగళూరులో శుక్రవారం భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఓవర్లను కుదించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరు జట్టు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే పంజాబ్ బౌలర్ల ధాటికి బెంగళూరు ఆటగాళ్లు ఏమాత్రం నిలబడలేకపోయారు. సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరుకున్నారు. పంజాబ్ బౌలర్ల దూకుడు ముందు బెంగళూరు బ్యాటర్లు నరకం చూశారు.. పట్టుమని 10 ఓవర్లలోపే ( 9 ఓవర్లకు) ఏడుగురు కీలక ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. కేవలం 43 రన్స్ స్కోర్ చేశారు. 18 ఏళ్ల క్రితం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై బెంగళూరు జట్టు ఇలాంటి ఆటనే ఆడింది. అప్పుడు కూడా 9 ఓవర్లలో 43 రన్స్ స్కోర్ మాత్రమే చేసి ఏడు వికెట్లను నష్టపోయింది. ఇక నిన్నటి మ్యాచ్ లోనూ బెంగళూరు 9 ఓవర్లలో 7 వికెట్లు లాస్ అయ్యి 43 రన్స్ స్కోర్ చేసింది. ఇక నాటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. ఇప్పుడు కూడా పంజాబ్ జట్టుపై ఒకే ఒక్క పరుగు చేశాడు. అయితే నాటి మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలైంది. ఇప్పుడు కూడా 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని పొందింది. “క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. మరెన్నో సంచలనాలు చోటుచేసుకున్నాయి. కానీ ఒకసారి జరిగిన సంచలనం.. 18 సంవత్సరాల తర్వాత మళ్లీ రిపీట్ కావడం ప్రేక్షకులను మాత్రమే కాదు.. ఆటగాళ్లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో ఏకంగా 46 మ్యాచ్లలో ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే సొంతమైదానంలో ఎక్కువ ఓటములు ఎదుర్కొన్న జట్టుగా బెంగళూరు అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. వర్షం కురవడం వల్ల పంజాబ్ బౌలర్లు బెంగళూరు ప్లేయర్లకు చుక్కలు చూపించారు. అంతేకాదు వెంట వెంటనే వికెట్లు పడగొట్టి ఆ జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించగలిగారు.
Also Read: మొదటి అర్ధ భాగం ముగిసింది.. ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఏవంటే?