PBKS VS KKR : గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించాడు. జట్టును అన్ని రంగాలలో ముందుండి నడిపించాడు. ఏకంగా విజేతగా నిలపాడు.. చాలా సంవత్సరాల తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును ఛాంపియన్ గా ఆవిర్భవించేలా చేశాడు.. జట్టను ముందుండి నడిపించడం మాత్రమే కాదు.. తన కూడా స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ గత సీజన్లో విజేతగా నిలిచింది. కానీ ఈ సీజన్లో మాత్రం ఊహించిన విధంగా.. అంచనాలు వేసిన విధంగా ఆడలేకపోతోంది. శనివారం పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా కు సొంత మైదానం ఒక్కటే సానుకూల అంశంగా మారింది. ఇక ఇటీవల బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోవడం.. ఆ జట్టును కాస్త ఇబ్బంది పెట్టింది. పాయింట్లు పట్టికలో పంజాబ్ జట్టు ఐదో స్థానంలోకి రావాల్సి వచ్చింది. ఇక వరుస విజయాలతో ముంబై జట్టు ఏకంగా మూడో స్థానంలో తిష్ట వేసుకుని కూర్చుంది. మొత్తంగా చూస్తే కేవలం కోల్ కతా కు మాత్రమే కాదు.. శనివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్ లో విజయం సాధించడం పంజాబ్ జట్టుకు కూడా అత్యంత అవసరం. పంజాబ్ జట్టులో అయ్యర్, ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్, నెహల్ వదెరా, శశాంక్ సింగ్ కీలక బ్యాటర్లుగా ఉన్నారు. అయితే కెప్టెన్ అయ్యర్ విఫలమవుతుండడం ఆ జట్టును ఇబ్బందికి గురి చేస్తోంది. అయ్యర్ రాణించిన తీరును బట్టే శనివారం పంజాబ్ భారీ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక బౌలింగ్లో అర్ష్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, బ్రాట్ లెట్, మార్కో జాన్సన్, యజువేంద్రచాహల్ వంటి వారు ఉన్నప్పటికీ.. కీలక దశలో వికెట్లు తీయలేకపోవడం పంజాబ్ జట్టును ఇబ్బందికి గురిచేస్తున్నది.
Also Read : మరో ఐదు మ్యాచ్లు.. సన్ రైజర్స్ ఇలా చేస్తేనే ప్లే ఆఫ్ వెళ్తుంది
కోల్ కతా నైట్ రైడర్స్ పరిస్థితి ఎలా ఉందంటే
పంజాబ్, గుజరాత్ టైటాన్స్ చేతిలో వరుసగా రెండు ఓటములు ఎదుర్కోవడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పరిస్థితి సంక్లిష్టంగా మారింది. గత నాలుగు మ్యాచ్లలో చెన్నై జట్టు మినహా.. మిగతా అన్నింటి చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమిపాలైంది. గుర్బాజ్, సునీల్ నరైన్, అండ్రి రస్సెల్, వెంకటేష్ అయ్యర్, రమణ్ దీప్ సింగ్ వంటి వారు ఉన్నప్పటికీ కూడా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోతోంది.. అది ఆ జట్టుకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇక బౌలింగ్లో సునీల్ నరైన్, అండ్రి రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా వంటి వారు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది.. అయితే శనివారం నాటి మ్యాచ్లో కోల్ కతా అన్ని విభాగాలలో రాణించాల్సి ఉంది. అప్పుడే ఆ జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. లేకపోతే ఇక అంతే సంగతులు. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో.. శనివారం జరిగే మ్యాచ్లో కూడా అదే పునరావృతం చేయాలని అయ్యర్ సేన భావిస్తోంది. మరోవైపు పంజాబ్ జట్టుతో సొంత వేదికగా జరిగే మ్యాచ్లో గెలవాలని కోల్ కతా యోచిస్తోంది. మొత్తంగా చూస్తే రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. అన్నట్టు ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
Also Read : ఒంటి చేత్తో క్యాచ్..మరో చేత్తో మ్యాచ్.. SRH పాలిట సూపర్ హీరో ఇతడు