Ajith : ఈమధ్య కాలం లో తమిళ హీరోలు అత్యధికంగా మన తెలుగులో సినిమాలు చేయడానికి అమితాసక్తి ని చూపిస్తున్నారు. అందుకు సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) ని ఎంచుకుంటున్నారు. కేవలం తమిళ హీరోలు మాత్రమే కాదు, మలయాళం అయినా, ఏ ఇండస్ట్రీ కి సంబంధించిన వారైనా తెలుగు లో సినిమా చేయాలంటే వెంకీ అట్లూరి నే ఎంచుకుంటున్నారు. ధనుష్ తో ‘సార్’ వంటి సెన్సేషనల్ హిట్ ని తీసిన వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ తో ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తీశాడు. ఈ సినిమా థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత అంతకంటే పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆయన తమిళ హీరో సూర్య తో ఒక సినిమా చేయబోతున్నాడు, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
Also Read : పవన్ కళ్యాణ్, వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ రిపీట్ చేసిన హీరో అజిత్..వీడియో వైరల్!
ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) తో ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే అజిత్ పర్సనల్ అసిస్టెంట్ ని కలిసి అజిత్ సార్ కి ఒక స్టోరీ ని వినిపించాలనే కోరికను వ్యక్తపరిచాడట డైరెక్టర్ వెంకీ. ఈ విషయం అజిత్ వరకు చేరడంతో కథ సిద్ధంగా ఉంటే వచ్చి వివరించామని వెంకీ కి మెసేజ్ చేసాడట. అంతే కాకుండా అతని రీసెంట్ చిత్రం లక్కీ భాస్కర్ ని చూశానని, చాలా అద్భుతంగా తీశావని మెచ్చుకున్నాడట అజిత్. త్వరలోనే అజిత్ ని కలిసి ఒక స్టోరీ ని వినిపించబోతున్నాడట డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. అయితే ఇది తమిళ చిత్రం అనుకుంటే పొరపాటే, ఇది ఫక్తు తెలుగు సినిమా అట.
చాలా కాలం తర్వాత అజిత్ తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు. ఆయన తొలిచిత్రం తెలుగు లోనే చేసాడు. 1993 వ సంవత్సరం లో ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రం ద్వారా హీరోగా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన చేస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే. ఇకపోతే అజిత్ రీసెంట్ గానే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తో మన ముందుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది. కేవలం 5 రోజుల్లోనే 172 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే దిశగా అడుగులు వేస్తుంది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.
Also Read : అజిత్ కూతురు ఏముందసలు.. హీరోయిన్ మెటీరియల్.. వైరల్ వీడియో