Bigg Boss 9 : ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) రియాలిటీ షో కి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 8 సీజన్స్ టెలికాస్ట్ అయితే, ప్రతీ సీజన్ కి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. గత సీజన్ లో కంటెస్టెంట్స్ మంచి కంటెంట్ ని ఇచ్చినప్పటికీ, నాగార్జున హోస్ట్ గా సరిగా ఆ కంటెంట్ ని ఉపయోగించుకోలేదు, అంతే కాకుండా గేమ్స్ కూడా ఆశించిన స్థాయిలో నిర్వహించలేదు. అందుకే గత సీజన్ యావరేజ్ అయ్యింది. అందుకే ఈ సీజన్ తో ఎలా అయినా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ యాజమాన్యం, మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ పాపులర్ సెలబ్రిటీ ఉప్పల్ బాలు ని ఒక కంటెస్టెంట్ గా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : ‘బిగ్ బాస్ 9’ లోకి అలేఖ్య చిట్టి..రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో ఇస్తున్నారా!
ఇప్పుడు మరో కంటెస్టెంట్ గా ప్రముఖ యంగ్ హీరో సుమంత్ అశ్విన్(Sumanth Ashwin) ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. ఈయన ప్రముఖ నిర్మాత MS రాజు కొడుకు. ‘తూనీగ తూనీగ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ‘కేరింత’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘లవర్స్’, ‘కొలంబస్’ ఇలా ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు. కేరింత, లవర్స్ చిత్రాలు కమర్షియల్ గా సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఎందుకో ఆ తర్వాత ఈ హీరో విజయాలను అందుకోలేకపోయాడు. చాలా కాలం నుండి సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న సుమంత్ అశ్విన్, తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్రారంభించాలని అనుకుంటున్నాడు. అందుకోసం బిగ్ బాస్ ని వేదికగా మార్చుకొని, తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరై, మళ్ళీ సినిమాల్లో అవకాశాలు సంపాదించే ప్లాన్ లో ఉన్నాడట. రీసెంట్ గానే బిగ్ బాస్ టీం ఈయన్ని సంప్రదించగా, వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
సుమంత్ తండ్రి MS రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), ప్రభాస్(Rebel Star Prabhas) వంటి స్టార్ హీరోలకు ఒక్కడు వర్షం లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించాడు. ముఖ్యంగా ప్రభాస్ తో MS రాజు కి మంచి సాన్నిహిత్యం ఉండేది. సుమంత్ ని ప్రభాస్ తన సొంత సోదరుడిలా చూసుకునేవాడట. ప్రభాస్ తో ‘వర్షం’ లాంటి సెన్సేషనల్ హిట్ తీసిన MS రాజు, ‘పౌర్ణమి’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని కూడా తీశాడు. ‘పౌర్ణమి’ చిత్రం చేసిన నష్టాల కారణంగా రాజు గారు తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఈ విషయాన్ని స్వయంగా సుమంత్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు. హీరో గా కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ ని ఎదురుకున్న సుమంత్ అశ్విన్ కి బిగ్ బాస్ 9 ద్వారా సరికొత్త లైఫ్ వస్తుందో లేదో చూడాలి.