Pawan Kalyan- Sheikh Rashid: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సహాయాల లిస్ట్ తీస్తే మాట్లాడుకుంటూనే ఉంటాము, మనకి తెలిసిన సహాయాలు కేవలం కొన్ని మాత్రమే, మనకి తెలియని సహాయాలు అయితే లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. ఆయన సహాయం పొందిన వారు నేడు వివిధ రంగాలలో గొప్పగా రాణిస్తున్నారు.అందులో ఒకడు రషీద్, నిన్న చీపక్ లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో సిక్స్ కి వెల్లబోయిన బంతిని క్యాచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
నిన్నటి నుండి ఇతగాడు సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ఇంతకు ఎవరీ చిచ్చరపిడుగు అంటూ గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు తెలిసింది , గతం లో ఈ కుర్రాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహాయం పొంది ఇక్కడి దాకా వచ్చాడని, పూర్తి వివరాల్లోకి ఒకసారి వెల్దాము.
రషీద్ లోని అద్భుతమైన ప్రతిభ ని గుర్తించి పవన్ కళ్యాణ్ గత ఏడాది రెండు లక్షల రూపాయిలు ఆర్ధిక సహాయం అందించాడు.దానికి సంబంధించిన ఫోటోలను మీరు క్రింద చూడవచ్చు, ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.గతం లో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రతిభావంతులను ఎంతగానో ప్రోత్సహించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చడానికి ఆర్ధిక సహాయం చేసాడు.
ఒక బాడీ బిల్డర్ కి అలాగే ఒక గన్ షూటర్ కి ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించాడు. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నా IPL టోర్నమెంట్ లో రషీద్ కి సహాయం అందించి, ఇండియన్ క్రికెట్ టీం కి ఒక గొప్ప ప్రతిభావంతుడిని బహుమతిగా ఇచ్చాడు. రాబొయ్యే రోజుల్లో ఇతను ఎలాంటి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడో చూడాలి.
ఇది మీకు తెలుసా???
నిన్న మ్యాచ్ లో కళ్ళు చెదిరే క్యాచ్ పట్టిన #csk ప్లేయర్ రషీద్ కు @JanaSenaParty అధినేత , కాబోయే AP CM @PawanKalyan గారు గత ఏడాది రెండు లక్షలు రూపాయిలు నగదు ప్రోత్సాహన్నీ ఇచ్చి రషీద్ ప్రతిభను మెచ్చుకున్నారు… #CSKvsPBKS #IPL2023 pic.twitter.com/GoLS7vinQa
— Narendra News (@Narendra4News) May 1, 2023