Pat Cummins IPL 2024: నా ఉద్దేశం, ప్రణాళికలు మీకు తెలియదు.. ఇదేనయ్యా మాకు కావాల్సింది..

కోల్ కతా తో పోటీకి ముందు హైదరాబాద్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. " సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించుకున్నాం. దూకుడయిన ఆటతీరును ప్రదర్శించాలని భావిస్తున్నాం. టీ - 20ల్లో క్షణాల్లో ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 22, 2024 2:09 pm

Pat CumminsIPL 2024

Follow us on

Pat Cummins IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ కు సర్వం సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో బెంగళూరు , చెన్నై ఢీ కొట్టబోతున్నాయి. ఇక మిగతా జట్లు తమ మ్యాచ్ ల కోసం సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ జట్టు కూడా కొత్త ఆశలతో ఈ టోర్నీని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఉప్పల్ మైదానం వేదికగా అతడు కఠోర సాధన చేస్తున్నాడు. తోటి ఆటగాళ్లు సైతం అదే స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. నెట్స్ లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐపీఎల్ కు హైదరాబాద్ జట్టు సరికొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కొత్త కెప్టెన్ కమిన్స్ ఆధ్వర్యంలో జట్టు గత కంటే బలంగా కనిపిస్తోంది. మార్చి 23న హైదరాబాద్ జట్టు కోల్ కతా తో పోటీ పడనుంది.

కోల్ కతా తో పోటీకి ముందు హైదరాబాద్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించుకున్నాం. దూకుడయిన ఆటతీరును ప్రదర్శించాలని భావిస్తున్నాం. టీ – 20ల్లో క్షణాల్లో ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా మేము అడుగులు వేసాం. కోల్ కతా కూడా అద్భుతమైన జట్టే. కానీ ఈ సీజన్ మేము మంచి ఆట తీర్థం మొదలుపెడుతున్నాం.. నా ఉద్దేశం, ప్రణాళికల గురించి మీకు తెలియదు.. నాకు అంతగా పరిచయం లేని ఆటగాళ్లతో కూడా సన్నిహితంగా ఉంటాను. నా నుంచి వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటాను. భువనేశ్వర్ కుమార్ వంటి అద్భుతమైన బౌలర్లో మా జట్టుకు ఉన్నారు. మార్క్రమ్ అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటాం. జట్టులో అనుభవజ్ఞులైన యువకులున్నారు. అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వారిని చూస్తే ముచ్చటేస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నామని” కమిన్స్ అన్నాడు.

కమిన్స్ వ్యాఖ్యల పట్ల హైదరాబాద్ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కెప్టెన్ హైదరాబాద్ జట్టు కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి హైదరాబాద్ జట్టుకు కప్ అందించాలని కోరుతున్నారు. ఇక గత సీజన్లో హైదరాబాద్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. 14 మ్యాచ్లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో హైదరాబాద్ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కమిన్స్ రావడంతో తమ జట్టు బలం పెరిగిందని హైదరాబాద్ ఆటగాళ్లు చెబుతున్నారు. కమిన్స్, హెడ్, క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్, మార్కో జాన్సన్ వంటి వారితో హైదరాబాద్ జట్టు దృఢంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా జట్టు కప్ సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.