MLC Kavitha: విచారణ నుంచి తప్పించుకోలేరు.. కవితకు షాక్‌ ఇచ్చిన సుప్రీం కోర్టు..

కవిత పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై విజయ్‌ మదన్‌లాల్‌ కేసుతో కలిపి విచారణ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుత కేసులో కవిత ట్రయల్‌ ఎదుర్కొనాల్సిందే అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ బేలా త్రివేది తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసం తేల్చి చెప్పింది.

Written By: Raj Shekar, Updated On : March 22, 2024 2:12 pm

MLC Kavitha

Follow us on

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో అరెస్ట్‌ అయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనను ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని, సుప్రీం కోర్టు నిబంధనలు పాటించలేదని దేశ అత్యున్నత న్యాయస్థానంలో కవిత పిటిషన్‌ వేశారు. దీంతో ఉపశమనం లభిస్తుందని భావించిన కవితకు నిరాశే ఎదురైంది. కవిత పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

ఈడీ కస్టడీలో కవిత..
ఇదిలా ఉండగా, కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీ చట్ట విరుద్ధం అని కవిత సుప్రీంకు తెలిపింది. కానీ, విచారణ కొనసాగుతున్నందున ప్రస్తుతం పిటిషన్‌ విచారణ చేయలేమని తెలిపింది. రాజీకీయ నాయకురాలు అయినంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండదని స్పష్టం చేసింది. ట్రయల్‌ కోర్టును ఎదుర్కొనాల్సిందే అని స్పష్టం చేసింది.

మదన్‌లాల్‌ కేసులో విచారణ..
ఇక కవిత పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై విజయ్‌ మదన్‌లాల్‌ కేసుతో కలిపి విచారణ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుత కేసులో కవిత ట్రయల్‌ ఎదుర్కొనాల్సిందే అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ బేలా త్రివేది తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసం తేల్చి చెప్పింది. కవిత పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీ అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక బెయిల్‌ కావాలంటే కవిత మొదట ట్రయల్‌ కోర్టులోనే పిటిషన్‌ వేయాలని కవిత తరఫు న్యాయవాదులకు సుప్రీం ధర్మాసనం చేయాలని సూచించింది. కవితకు లభించిన ఉపశమనం ఏమిటంటే పిటిషినర్‌ మహిళ కాబట్టి ట్రయల్‌ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.