Pat Cummins : సాధారణంగా క్రికెటర్లు ఏదైనా దేశానికి పర్యటన నిమిత్తం వెళ్ళినప్పుడు..వచ్చామా? ఆడామా? అన్నట్టుగానే వారి పరిస్థితి ఉంటుంది. కానీ కొంతమంది క్రికెటర్లు అలా కాదు.. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అక్కడి మనుషులతో సంబంధాలు పెంచుకుంటారు. అక్కడి ఆత్మీయతను ఆస్వాదిస్తారు. అంతిమంగా ఆ దేశంలో ఒక సభ్యుడు అయిపోతారు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ యాజమాన్యం కమిన్స్ ను నాయకుడిగా చేసింది. హైదరాబాద్ జట్టుకు సారధిగా నియమించింది. అతని కంటే గొప్పగా ఆడే క్రికెటర్లు చాలామంది ఉండవచ్చు గాని.. అతనిలా ఆలోచించే ప్లేయర్లు లేకపోవడంతో హైదరాబాద్ యాజమాన్యం మరో మాటకు తావు లేకుండా కమిన్స్ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. విజయమైనా.. ఓటమైనా.. ఏది ఎదురైనా సరే కమిన్స్ నాయకత్వాన్ని మార్చేది లేదంటూ దూసుకుపోతోంది. అయితే తనకు ఎన్నో ఇచ్చిన ఈ దేశం పట్ల కమిన్స్ విపరీతమైన ఆరాధన భావాన్ని కలిగి ఉంటాడు. ఎప్పటికప్పుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ దేశం పై అతడు తన ఇష్టాన్ని ప్రదర్శించాడు. కాకపోతే ఇప్పుడు అతడు వ్యక్తం చేసిన భావం సరికొత్తగా ఉంది. చాలామందికి చెంపపెట్టు లాగా ఉంది.
Also Read : నిరుడు ఛాంపియన్..ఈ ఏడు గ్రూప్ దశలోనే.. పాపం కోల్ కతా
ఉగ్రవాద దేశంతో మనం సాగిస్తున్న యుద్ధం ఇవాల్టిది కాదు. అయినప్పటికీ ప్రతి సందర్భంలో ఉగ్రవాద దేశంతో మనం సాగిస్తున్న సమరానికి మన దేశ ప్రజలు తమ సమ్మతం తెలుపుతున్నారు. అవసరమైతే తాము యుద్ధంలోకి వస్తామని పేర్కొంటున్నారు.. కానీ కొంతమంది ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసే లేకి గాళ్లకు ఈ దేశం విలువ తెలియడం లేదు. ఎవరు చెప్పినా అర్థం కావడం లేదు. చివరికి కమిన్స్ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆయన తెలుస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఇటీవల దిక్కుమాలిన ఉగ్రవాద దేశంలో ఏర్పడిన దారుణం వల్ల.. ఐపీఎల్ తాత్కాలికంగా వాయిదా పడింది. చివరికి శనివారం నుంచి మొదలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ కెప్టెన్
కమిన్స్ సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీ ని కీర్తిస్తూ ఒక పోస్ట్ చేశాడు..” భారత శక్తివంతమైన సైన్యానికి ధన్యవాదాలు. కృతజ్ఞతా భావంతో కోట్ల మంది హృదయాలు మళ్ళీ ఒక్కటయ్యాయి. భారత సైన్యాన్ని చూసిన వారందరూ గర్వపడుతున్నారు. వారి స్ఫూర్తిని చూసి ఉద్వేగానికి గురవుతున్నారు. థాంక్యూ ఇండియన్ ఆర్మీ ” అంటూ కమిన్స్ పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ ను బీసీసీఐ రూపొంది. ఐపీఎల్ లోని పది జట్ల కెప్టెన్లతో బీసీసీఐ ఈ చిత్రాన్ని రూపొందించింది. కమిన్స్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన స్టోరీ ఆకట్టుకుంటున్నది. కమిన్స్ మన దేశంపై చూపించిన ప్రేమకు.. చూపిస్తున్న ఆప్యాయత ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.