Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట.. ఎందులో మెడల్స్ వచ్చాయంటే?

పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో మొదటిరోజు భారత అథ్లెట్లు పతకాల వేటను మొదలుపెట్టలేదు. ఆ తర్వాత రెండవ రోజు అసలు సిసలైన సత్తాను చూపించడం మొదలుపెట్టారు. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించి ఔరా అనిపించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 31, 2024 9:26 am

Paris Paralympics 2024

Follow us on

Paris Paralympics 2024: ఈసారి టార్గెట్ 25 మెడల్స్ లక్ష్యంగా భారత అథ్లెట్లు రంగంలోకి దిగారు.. అనుకున్నట్టుగానే ఒకేరోజు నాలుగు మెడల్స్ సాధించి అంచనాలను నిజం చేసి చూపించారు.. మహిళల 10 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్లు “డబుల్” సంతోషాన్ని నింపారు.. షూటర్ అవని లేఖారా వరుసగా రెండవ పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎయిర్ ఫిస్టల్ లో మనీష్ సర్వాల్ రజతం సాధించాడు. ఇక మరో షూటర్ మోనా అగర్వాల్ కాంస్యం అందుకుంది. మహిళల 100 మీటర్ల రేసులో ప్రీతి పాల్ కాంస్యం దక్కించుకుంది. టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు 19 మెడల్స్ సాధించారు.. అయితే ఈసారి భారీ అంచనాలతో పారిస్ లోకి అడుగు పెట్టారు. అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన ప్రదర్శన చూపుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రస్తుతం భారత ఖాతాలో ఒక స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు ఉన్నాయి.

డబుల్ ఆనందం

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్ -1 ఫైనల్ లో భారత్ రెండు మెడల్స్ సాధించింది. ఇందులో అవని (22 సంవత్సరాలు) 249.7 స్కోర్ తో ఛాంపియన్ గా ఆవిర్భవించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ ఆమె స్వర్ణం గెలుచుకుంది. దీంతో రెండు పారా ఒలింపిక్స్ లో స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయ అథ్లెట్లు అవని చరిత్ర సృష్టించింది. ఫైనల్ లో కొరియా షూటర్ లీ యున్రీ తో హోరా హోరిగా పోరాడి అవని స్వర్ణాన్ని సాధించింది. మొత్తంగా 0.1 సెకండ్ల తేడాతో తన బెస్ట్ పారా గేమ్స్ స్కోర్ ను కూడా నమోదు చేసింది. ఇక ఇదే విభాగాలలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ సత్తా చాటింది. 228.7 స్కోర్ తో కాంస్యం సాధించింది..

అథ్లెటిక్స్ విభాగంలో..

పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ తొలిసారిగా మెడల్ దక్కించుకుంది. మహిళల 100 మీటర్ల పరుగులు టీ 35 ఫైనల్ లో ప్రీతి పాల్ 14.21 సెకండ్ల టైమింగ్ తో కాంస్యం సొంతం చేసుకుంది. అంతేకాదు పర్సనల్ బెస్ట్ టైం ను ప్రీతి నమోదు చేసింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లోనూ ప్రీతి కాంస్యం సాధించింది.

సత్తా చాటాడు

భారత మరో షూటర్ మనీష్ అగర్వాల్ టోక్యో పారా ఒలింపిక్స్ లో మిక్స్ డ్ టీమ్ 50 మీటర్ల పిస్టల్ లో స్వర్ణం అందుకున్న అతడు.. పారిస్ పారా ఒలింపిక్స్ లోనూ పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఎస్ హెచ్ -1 లో 234.9 పాయింట్లతో రజతం సాధించాడు. వాస్తవానికి ఇతడు స్వర్ణం సాధిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే చివర్లో గురి తప్పాడు. చివరిదైన 24 షాట్ లో మనీష్ 89, 99 స్కోర్ చేశాడు. కొరియా దేశాన్ని చెందిన జొంగ్దు 10.8, 8.7 స్కోర్ తో గోల్డ్ మెడల్ సాధించాడు.