Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఓపెనింగ్ షూట్ కంప్లీట్......

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఓపెనింగ్ షూట్ కంప్లీట్… లీకైన కంటెస్టెంట్స్ లిస్ట్, హౌస్లోకి క్రేజీ సెలెబ్స్!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. బిగ్ బాస్ లవర్స్ లాంచింగ్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందుకు ప్రధాన కారణం.. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు. హౌస్లోకి వెళ్లే సెలెబ్స్ ఎవరో చూడాలనే ఆతృతగా ప్రేక్షకుల్లో ఉంటుంది. అలాగే హీరోయిన్స్, కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫార్మన్స్ లు ఆకట్టుకుంటాయి. స్టార్స్ సైతం బిగ్ బాస్ వేదికపై ప్రత్యక్షం అవుతారు.

అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అవుతుంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. కంటెస్టెంట్స్ గా ఎంపికైన సెలెబ్రిటీల మీద పరిచయ వీడియోలు చేస్తారు. అలాగే సన్నిహితుల ద్వారా మేటర్ లీక్ కావచ్చు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ షూటింగ్ టైంలో లేదా ఎడిటింగ్ రూమ్ నుండి లిస్ట్ లీక్ అవుతుంది.

బిగ్ బాస్ నిబంధనల ప్రకారం ఎంపికైన వారు సమాచారం ఎవరికీ చెప్పకూడదు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రోజు ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయాల్సి ఉంటుంది. సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాని ప్రకారం… సోషల్ మీడియా స్టార్ బేబక్కకు ఛాన్స్ దక్కిందట. ఆమె హౌస్లో అడుగుపెట్టబోతుంది. బోల్డ్ వీడియోలతో పాపులరైన యూట్యూబర్ సీత సైతం ఎంపికైందట.

సీరియల్ నటి యాష్మి గౌడ లిస్ట్ లో ఉన్నారట. ఆమె బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్ట్ చేస్తున్నారని సమాచారం. బోల్డ్ యాంకర్ విష్ణుప్రియ హౌస్లో సందడి చేయనుందట. న్యూస్ రీడర్ కళ్యాణి, నటుడు ఆదిత్య ఓం, నటుడు అభయ్ నవీన్, ఆర్జే శేఖర్ భాషా ఎంపికైన వారిలో ఉన్నారట.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్…
బెజవాడ బేబక్క
నైనిక
యష్మి గౌడ
నటుడు ఆదిత్య ఓం
సీరియల్ నటుడు నిఖిల్
నటుడు అభయ్ నవీన్
ఆర్జే శేఖర్ భాషా
కిరాక్ సీత
విష్ణుప్రియ
నటి ప్రేరణ
సోనియా ఆకుల
పరమేశ్వర్
న్యూస్ రీడర్ కళ్యాణి
మణికంఠ
రవితేజ అనపర్తి

మరి వీరిలో నిజంగా హౌస్లో అడుగు పెట్టేది ఎవరు అనేది తెలియదు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా సమాచారం మాత్రమే. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిస్తే కానీ అసలైన కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు రాదు.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version