Luana Alonso: అమ్మ బ్రహ్మదోవేవో… కొంప ముంచినావురో.. పూల రెక్కలు.. కొన్ని తేనెచుక్కులు.. రంగరిస్తివో.. ఇలా బొమ్మ చేస్తివో.. అంటూ ఓ సినీ కవి నటి శ్రీదేవి అందాన్ని వర్ణించాడు. ఇక మరో సినిమాతో.. హీరోయిన్ త్రిష.. అయ్యో దేవుడా.. ఎందుకయ్యాన నన్ను ఇంత అందగా పుట్టించావు.. అందగా పుట్టడమే నేను చేసిన తప్పా అని డైలాగ్ చెబుతుంది. అందం పుట్టాక అమ్మాయి పుట్టిందా.. అమ్మాయి పుట్టిందా అంటే ఎవరూ చెప్పలేరు. అందాన్ని, అమ్మాయిని విడదీసి చూడలేము. అయితే అందం అమ్మాయిలకు ఓ వరం. ప్రపంచంలో కళ్లు తిప్పుకోలేని అందం ఉన్న ఎందరో అమ్మాయిలు ఉన్నారు. అందాన్ని మరింత పెంచుకోవడానికి ఇప్పుడు షేలియల్స్, మేకప్స్, క్రీమ్స్, పౌడర్లు ఇలా ఏవేవో వాడుతున్నారు. మరింత అందగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరం లాంటి అందమే.. ఇక్కడ ఓ అమ్మాయికి ఇబ్బందిగా మారింది. ఒలింపిక్స్ క్రీడా గ్రామం నుంచి ఆమెను పంపించేలా చేశాయి. పగార్వేకు చెందిన 20 ఏళ్ల యువ స్విమ్మర్ లువానా అలోన్సా చాలా అందంగా ఉంటుంది. ఈ అందమే ఆమెకు శాపంగా మారింది. తోటి క్రీడాకారులు లువానా తన అందచందాలతో ఇబ్బందిపెడుతోందని గుర్తించిన ఆ దేశ ఒలింపిక్ అధికారులు ఆమెను ప్యారిస్ ఎలింపిక్స్ నుంచి స్వదేశానికి పంపించివేశారు. ఒలింపిక్స్‌లో పరేగ్వ తరఫున స్విమ్మింగ్‌లో పాల్నొగేందుకు ఆమె ప్యారిస్‌కు వచ్చింది. జూలై 27న జరిగిన 100 మీటర్ల మహిటా బటర్ ఫ్లై సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయింది. పోటీ ముగిసినా ఒలింపిక్స్ ముగిసే వరకు క్రీడా గ్రామంలో ఉండేందుకు పరాగ్వే అధికారులు అనుమతి ఇచ్చారు.
మ్యాచ్‌లు తిలకిస్తూ.. మాదానల్లో సందడి చేస్తూ.
లువానా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ క్రీడాంశాలకు చెందిన మ్యాచ్‌లు తికలిస్తూ ఎంజాయ్ చేస్తోంది. స్విమ్ సూట్ వేసుకుని మైదానంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది లువానా. దీంతో ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. పరాగ్వే బృందం మొత్తం లువానా అలోన్సో అందాలకు ఫిదా అయింది. ఆమెతో మాట్లాడడానికి, ఇంప్రెస్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
క్రీడా గ్రామంలో స్వప్న సుందరిలా..
తన అందంతో క్రీడా గ్రామంలో తిరుగుతూ.. తన అందచందాలు ఒలకబోస్తూ.. వందలాది మంది క్రీడాకారుల దృష్టిని తనవైపు మరల్చుకుంది లువానా. ఎంతో మందికి స్వప్న సుందరిగా మారిపోయింది. ఆమెను చూసిన క్రీడాకారులంతా రాత్రి ఆమెనే ఊహించుకోవడం, ఆమె గురించే మాట్లాడుకోవడం కనిపించింది. ఈ క్రమంలో లువానా తన అందంతో పరాగ్వే క్రీడాకారుల దృష్టిని మరలుస్తోందని గుర్తించిన అధికారులు ఉన్నఫళంగా ఆమెను స్వదేశానికి పంపించాలని నిర్ణయించారు. ఈమేరు ఫ్లైట్ ఎక్కించేశారు.
మరుసటి రోజే షాక్..
ప్యారిస్ క్రీడా గ్రామం నుంచి పరాగ్వే వెళ్లిన లువానా అలోన్సో స్వదేశానికి చేరిన మరుసటి రోజు అ దేశ ఒలింపిక్స్ అధికారులకు షాక్ ఇచ్చింది. స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. తనకు మద్దతుగా నిలిచిన పరాగ్వే 6పజలకు ధన్యవాదాలు తెలిపింది. అయితే తనను ప్యారిస్ నుంచి పంపించిన విషయమై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే కారణం మాత్రం అదే అయి ఉంటుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More