Shoaib Malik Sania Mirza: షోయబ్ మాలిక్ సానియా మీర్జా విడిపోవడానికి కారణం ఏంటో చెప్పిన పాక్ మీడియా…

2018లో ఇజాన్ అనే పిల్లాడు జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా షోయబ్ మాలిక్ నటి సనా జావేద్ ని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ కి మధ్య దూరం పెరుగుతూ వస్తుందంటూ చాలా వార్తలైతే వచ్చాయి.

Written By: Gopi, Updated On : January 24, 2024 8:23 am
Follow us on

Shoaib Malik Sania Mirza: భారతదేశపు టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ అయిన షోయబ్ మాలిక్ ని 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే అప్పుడు వీళ్లు చాలా గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.

ఇక వీళ్ళకి 2018లో ఇజాన్ అనే పిల్లాడు జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా షోయబ్ మాలిక్ నటి సనా జావేద్ ని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ కి మధ్య దూరం పెరుగుతూ వస్తుందంటూ చాలా వార్తలైతే వచ్చాయి. కానీ వాటన్నింటిలో నిజం లేదన్నట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాటిని కప్పిపుచ్చుతూ వచ్చారు. ఇక దీంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమీ లేవు మళ్ళీ ఇద్దరు కలిసిపోయారని అందరూ అనుకున్నప్పటికీ మాలిక్ మాత్రం సానియా మీర్జా కి అన్యాయం చేస్తూ సనా జావేద్ ని పెళ్లి చేసుకోవడం పట్ల మాలిక్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి…

ఇక ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరు కూడా అధికారికంగా ప్రకటించనప్పటికీ, పాకిస్తాన్ మీడియా మాత్రం ఈ విషయం పైన స్పందిస్తూ వాళ్ళు విడిపోవడానికి గల కారణం ‘షోయబ్ మాలిక్ సానియా మీర్జా కి అన్యాయం చేయడమే’ అంటూ రాసుకొచ్చింది. ఇక అందులో భాగంగానే షోయబ్ మాలిక్ 3 సంవత్సరాలుగా ‘సనా జావేద్ ని రహస్యం గా కలుస్తున్నట్టుగా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు గా సానియా మీర్జా కి తెలియడం తో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇక దాంతో సానియా మీర్జాకి విడాకులు ఇచ్చాడని పాకిస్తాన్ మీడియా రాసుకొచ్చింది. ఇక ఈ విషయంలో సానియా మీర్జా కి సపోర్టుగానే షోయబ్ మాలిక్ ఫ్యామిలీ ఉన్నట్టుగా తెలుస్తుంది…

మొత్తానికైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇలా విడిపోవడం తో చాలా మందికి భాద కలిగిస్తుందనే చెప్పాలి. అయితే మాలిక్ కి ఇది రెండో పెళ్లి కాదు, మూడో పెళ్లి… మొదట 2002 అయేషా సిద్ధిఖి అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమెతో ఏర్పడిన విభేదాలు వల్ల ఆమెకి డివోర్స్ ఇచ్చేసి, ఆ తర్వాత 2010 లో సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈమెకి కూడా విడాకులు ఇచ్చి సనా జావేద్ ని మూడో పెళ్లి చేసుకున్నాడు…