Horoscope Today
Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 జనవరి 24 బుధవారం ఓ రాశి వ్యాపారులు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. మరో రాశి వారు కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు మానసిక ఒత్తిడితో ఉంటారు. ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. అందువల్ల ఎక్కువగా వాదనలకు దిగొద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృషభం:
ఈ రాశివారికి ఈరోజుధనలాభం అధికంగా ఉంటుంది. ఏదైనా పనిచేయాలనుకుంటే స్నేహితులు, సోదరులు మద్దతు ఇస్తారు. అనుకున్న పనులు కష్టపడి పూర్తి చేస్తారు.
మిథునం:
ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం.
కర్కాటకం:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలపై ఇతరులపై ఆధారపడొద్దు.
సింహ:
ఓ శుభవార్త వింటారు. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా పెండింగులోఉన్న పనులు పూర్తవుతాయి.
కన్య:
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు పెట్టుబడులు పెడుతారు. గతంలో పెండింగులో ఉన్న పనులుపూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.
తుల:
వ్యాపారులకు అసవరమైన సాయం అందుతుంది. ఉద్యోగులకు తోటివారు సహకరిస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తే అందులో విజయం సాధిస్తారు.
వృశ్చికం:
ఓ సంఘటన మానసికంగా బాధిస్తుంది. కొన్ని పనుల్లో ఎక్కువగా కష్టపడుతారు. ఏ పనిలోనైనా తొందరపడొద్దు. ఆర్థిక ఆదాయం తక్కువగానే ఉంటుంది. ప్రతీ విషయానికి ఆందోళన చెందవద్దు.
ధనస్సు:
ఉద్యోగులు సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. కొన్ని ప్రత్యేక పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో తొందరపడొద్దు.
మకర:
ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారితో సంబంధాలు చెడుతాయి. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తవ్యక్తులను కలుస్తారు.ఆధ్యాత్మిక కార్యకలాపాలపై శ్రద్ధ చూపుతారు. పాత వివాదాలు పరిష్కారం అవుతాయి.
మీనం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని విషయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. ఏ పనిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయాలుతీసుకుంటారు.