https://oktelugu.com/

Akkineni Akhil: ఎన్టీయార్, రామ్ చరణ్ లా అఖిల్ సక్సెస్ కాకపోవడానికి ఇదొక్కటే కారణం…

అఖిల్ సక్సెస్ కాకపోవడం లో లోపం జరిగిందంటే ఆయన ఇండస్ట్రీకి రాకముందే ఆయన్ని ఒక స్టార్ హీరోగా ప్రాజెక్ట్ చేశారు. దానివల్ల తను స్టార్ ని అని ఫీల్ అయిపోయిన అఖిల్ స్టార్ లా ఉండే సినిమాలు మాత్రమే చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 24, 2024 8:19 am
    Akkineni Akhil
    Follow us on

    Akkineni Akhil: తెలుగు సినిమా ఇండస్ట్రీ తో విడదీయలేని బంధం ఉన్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి…అక్కినేని నాగేశ్వరరావు తొలుత ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన ఎక్కువగా రొమాంటిక్, జానపద సినిమాల్లో నటించి ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో పాటు తను కూడా ఒక లెజెండరీ యాక్టర్ గా ఎదిగాడు. ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లను రెండు కండ్లు గా చెప్పుకుంటూ ఉంటారు.

    ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి రెండవ తరం హీరోగా బాలయ్య బాబు, మూడోతరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వాళ్ల సత్తా చాటుతున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం రెండవ తరం హీరోగా వచ్చిన నాగార్జున స్టార్ హీరో గా మారినప్పటికీ, మూడోతరం హీరోగాలుగా వచ్చిన నాగచైతన్య, అఖిల్ లు మాత్రం పెద్దగా సక్సెస్ సాధించడం లేదు. ఇక నాగచైతన్య విషయం పక్కన పెడితే అఖిల్ మాత్రం అసలు ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోతున్నాడు. ఆయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి ఇప్పటి వరకు అతనికి ఒక్కటి కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన మీద ఇండస్ట్రీలో చాలా రకాల కామెంట్లు అయితే వస్తున్నాయి.

    అయితే అఖిల్ సక్సెస్ కాకపోవడం లో లోపం జరిగిందంటే ఆయన ఇండస్ట్రీకి రాకముందే ఆయన్ని ఒక స్టార్ హీరోగా ప్రాజెక్ట్ చేశారు. దానివల్ల తను స్టార్ ని అని ఫీల్ అయిపోయిన అఖిల్ స్టార్ లా ఉండే సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఎలా అంటే కెరియర్ స్టార్టింగ్ లో ఎన్టీయార్, రామ్ చరణ్ లాంటి నటులు పేదవాళ్ళు గా ఉన్న క్యారెక్టర్ లలో నటించారు. కానీ అఖిల్ ఇప్పటి వరకు అలాంటి పాత్రల్లో నటించలేదు.

    అంటే తను చేసే సినిమా పాత్రల్లో కూడా స్టార్ స్టేటస్ ఉండే పాత్రలు మాత్రమే చేస్తున్నాడు. అందుకే ఆ సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. అలా కాకుండా ఒక జన్యున్ కథని తీసుకొని, తన మార్కెట్ ని దృష్టి లో పెట్టుకొని, అలాగే అభిమానుల్లో తనకి ఉన్న క్రేజ్ ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి. అలా కాకుండా స్టార్ గానే సినిమాలు చేసుకుంటు వెళ్తాను అంటే మాత్రం ఆయనకున్న మార్కెట్ కి, పెట్టే బడ్జెట్ కి ప్రతి సినిమా మరో ఏజెంట్ సినిమాలా అవ్వాల్సిందే తప్ప సక్సెస్ మాత్రం రాదు అని ట్రేడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…