India vs Pakistan: అభిమానం ఒక స్థాయి వరకు ఉంటే బాగానే ఉంటుంది. అది కట్టలు తెంచుకుంటేనే అసలు సమస్య ఎదురవుతుంది.. అలాంటిదే ఇది కూడా.. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలోని యువకుడికి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. పైగా తన జట్టు ఎక్కడికి వెళ్లినా మ్యాచ్ చూస్తాడు.. అయితే ఈసారి మ్యాచ్ చూసేందుకు అతడి వద్ద డబ్బులు లేవు.. అయినప్పటికీ తన వ్యసనాన్ని అణుచుకోలేక.. ఎవరూ చేయకూడని పని చేశాడు. చివరికి నవ్వుల పాలయ్యాడు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్త ప్రకారం ..పాక్ దేశానికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు.. అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అంటే చాలా ఇష్టం. ఆ జట్టు భారత్ మీద గెలిస్తే చూడాలనేది అతడి ఆకాంక్ష.. గతంలో చాలా మ్యాచులను ఇలానే చూశాడు. అయితే పాకిస్తాన్ 2021లో మాత్రమే భారత్ మీద గెలిచింది. ఐసీసీ నిర్వహించిన మెగాటోర్నీలలో వరుసగా విఫలమవుతూనే వస్తోంది. అయితే ఈసారి న్యూయార్క్ వేదికగా జరిగే టి20 మ్యాచ్ లో ఎలాగైనా తన అభిమాన పాకిస్తాన్ జట్టు గెలవాలని భావించాడు. ఆ ఆనందాన్ని కళ్లారా చూడాలని అనుకున్నాడు. ఇటు చూస్తే చేతిలో డబ్బు లేదు. టికెట్ ధర చూస్తే ఆకాశాన్ని అంటుతోంది. ఇలాంటి సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది.
అమెరికాలో స్థిరపడిన ఆ పాకిస్తాన్ దేశస్థుడు తన వద్ద ఉన్న ఒక పాత ట్రాక్టర్ ను విక్రయించాడు. అలా విక్రయించగా వచ్చిన నగదులో 3000 అమెరికన్ డాలర్లు పెట్టి మ్యాచ్ టికెట్ కొనుగోలు చేశాడు.. ముందుగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలింగ్ చేసి.. భారత జట్టును 119 పరుగులకు అలౌట్ చేసింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే సమయంలో తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ముఖ్యంగా బాబర్ అజామ్, రిజ్వాన్, ఇఫ్తి కార్ వంటి వారిని బుమ్రా అవుట్ చేయడంతో ఆ పాకిస్తాన్ అభిమాని ఆశలు అడుగంటిపోయాయి. ఒకానొక దశలో 10 ఓవర్లకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 50+ పరుగులు చేసిన పాకిస్తాన్.. మిగతా వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో ఓటమిపాలైంది. దీంతో ఆ అభిమాని గుండె బద్దలైంది. ” 3000 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే పాకిస్తాన్ ఓడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి నా గుండె బరువెక్కింది. ఇంతకు మించిన బాధ ఇంకొకటి ఏముంటుందని” ఆ అభిమాని ఓ ప్రైవేట్ ఛానల్ విలేకరి ఎదుట తన బాధను వ్యక్తం చేశాడు.. అన్నట్టు ఈ విజయం తర్వాత భారత జట్టు అభిమానులు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అర్ధరాత్రి అయినప్పటికీ వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చి.. సందడి చేశారు.
Also Read: India vs Pakistan : వారెవ్వా బుమ్రా.. అవి బంతులా.. దూసుకొచ్చే బుల్లెట్లా? వీడియో వైరల్
#WATCH | Madhya Pradesh | People celebrate in Indore as India beat Pakistan by 6 runs in ICC T20 World Cup 2024 at Nassau County International Cricket Stadium, New York pic.twitter.com/UlwWd7x5Lw
— ANI (@ANI) June 10, 2024