IND vs PAK : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోవడం జరిగింది.దాంతో ఇండియన్ అభిమానులు పండుగ చేసుకుంటుంటే పాకిస్తాన్ అభిమానులు మాత్రం తీవ్రమైన భాద లో ఉన్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిన కూడా ఇండియన్ టీమ్ కి కనీస పోటీ అయిన ఇస్తుంది అని అనుకున్నారు.కానీ అదేం లేకుండా ఇండియన్ బౌలర్లు ఆ మ్యాచ్ ని వన్ సైడ్ చేయడంతో అభిమానులకి పాకిస్తాన్ టీం పట్ల తీవ్రమైన కోపం రావడంతో పాటుగా ఏం చేయాలో తెలీక వాళ్లలో వాళ్లే చాలా బాధపడుతున్నారు.
నిజానికి పాకిస్తాన్ టీం కి ఉన్న వీరాభిమానులలో బషీర్ చాచా ఒకరు.ఈయన పాకిస్థాన్ టీమ్ ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా ఆ గ్రౌండ్ లోకి వెళ్లి ఆ టీమ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు.నిజానికి ఈయన పాకిస్తాన్ లో పుట్టినప్పటికీ చికాగోలో నివాసముంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఈసారి పాకిస్తాన్ టీమ్ ఇండియా టీమ్ ని ఓడిస్తుంది అని బాగా నమ్మి ఇండియా ఓటమిని మనం కళ్లారా చూడాలి అనే ఉద్దేశ్యంతో ఆయన చికాగో నుంచి అహ్మదాబాద్ వచ్చి నరేంద్ర మోడీ స్టేడియంలో ఆ మ్యాచ్ ని లైవ్ లో చూశారు.ఇక ఆ మ్యాచ్ చూసిన బషీర్ చాచా కి పాకిస్తాన్ ఇండియాని ఓడించడం కాదు కదా కనీస పోటీని కూడా ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకి గురయ్యారు.దాంతో ఆ మ్యాచ్ ని చూడలేక ఆయన కొంత ఇబ్బంది పడడంతో ఆయనకి బీపీ డౌన్ అయింది దానివల్ల అంబులెన్స్ వచ్చి ఆయన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.
ఇక ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన పూర్తి గా కోలుకున్న తర్వాత ఆయన ఆవేదనని వ్యక్తం చేశారు. 152 పరుగులకు వద్ద రెండు వికెట్లు కోల్పోయి ఉన్న పాకిస్తాన్ టీం ఆ తర్వాత 191 పరుగుల వద్ద ఆలౌట్ అవ్వడం ఏంటి అంటూ ఆయన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ టీం మొదట్లో బాగానే ఆడుతూ మంచి స్టార్ట్ ఇస్తు వచ్చినప్పటికీ కొద్దిపాటి ఓవర్లు గడిచే వరకు కూడా బౌలర్లను కొంతవరకు బాగానే ఎదుర్కొన్నారు.దీంతో పాకిస్తాన్ టీం 50 ఓవర్లు పూర్తియ్యేసరికి 280 నుంచి 300 పరుగుల వరకు చేయగలుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇండియన్ టీమ్ బౌలర్లు చేసిన మ్యాజిక్ ముందు పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ నిలబడలేక పోయారు.ఆ తర్వాత వచ్చినవారు వచ్చినట్టు గా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరుకున్నారు.
దాంతో పాకిస్తాన్ టీం 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడకుండా 42 ఓవర్లలోనే 191 పరుగులు చేసి ఆలౌట్ అవ్వడం జరిగింది. ఇక ఈ ఓటమి పట్ల బషీర్ చాచా స్పందిస్తూ ఇకమీదట వరల్డ్ కప్ లోని ఏ మ్యాచ్ ని కూడా నేను చూడనని పాకిస్థాన్ టీమ్ ఈ మ్యాచ్ లో మా అందరినీ తీవ్రం గా నిరాశపరిచిందని ఆయన ఆవేదనని వ్యక్తం చేస్తూ వెళ్ళిపోవడానికి తన బ్యాగ్ సర్దుకుంటూ ఒక పాట కూడా పాడాడు… ఆ పాట కు సంభందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బషీర్ చాచా వ్యవహారాన్ని చూసిన కొందరు ఆయన డబ్బులు పెట్టుకొని చికాగో నుంచి వస్తే కనీస పోటీ లేకుండా పాకిస్తాన్ ఇంత పేలవమైన పర్ఫామెన్స్ ని ఇవ్వడంతో ఆయన చాలా నిరాశకు గురయ్యాడని ఆయనలా మాట్లాడటం లో ఎలాంటి తప్పు లేదని చాలామంది ఆయన కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
ఇక కొందరు మాత్రం క్రికెట్ అన్న తర్వాత ఆడడం, గెలవడం, ఓడిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఒక్క ఓటమి ద్వారా ఏం పోయింది. వరల్డ్ కప్ లో ఇంకా చాలా మ్యాచులు ఉన్నాయి అవి బాగా ఆడితే పాకిస్థాన్ టీమ్ సెమీ ఫైనల్ కి వెళ్లొచ్చు, వీలైతే ఫైనల్ కి కూడా వెళ్తుంది,ఒక వేళ అన్ని కుదిరితే కప్పు కూడా కొట్టొచ్చేమో… ఈ మాత్రం దానికే బషీర్ చాచా డిసప్పాయింట్ అయితే ఎలా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే మరికొందరు 1992 సంవత్సరంలో పాకిస్తాన్ ఇండియా మీద ఓడిపోయినప్పటికీ ఆ ఇయర్ పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలిచింది. ఇక్కడ గెలుపు ఓటములను మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు అని చెబుతున్నారు…
You feel for fans like Chacha. He is frustrated. And rightly so. He expected a fight as we all did. Now he says he wants to go back. @RevSportz @debasissen @CricSubhayan the World Cup is not won or lost with one game. In 1992 Pakistan won the cup after losing to India. In 1999… pic.twitter.com/dg8gzmS60G
— Boria Majumdar (@BoriaMajumdar) October 15, 2023