https://oktelugu.com/

Zimbabwe VS Pakistan : అప్పటిదాకా 37/0.. ఆ తర్వాతే జింబాబ్వే కథ మారింది.. చివరికి పాక్ ఎలా ఆడిందంటే..

వేదిక బులలోవాయో.. అది జింబాబ్వే కు సొంత గ్రౌండ్.. ప్రత్యర్థి జట్టు ఎలాంటిదైనా.. ఇంత కొంత ఆతిధ్య దేశానికి అడ్వాంటేజ్ ఉంటుంది. జింబాబ్వే కూడా దానిని కొనసాగించింది. కానీ చివరి వరకు దానినే నిలబెట్టుకోలేకపోవడంతో పరుగు పోగొట్టుకుంది. మొత్తంగా పాకిస్తాన్ ముందు మరోసారి తలవంచి సిరీస్ కోల్పోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 3, 2024 / 09:54 PM IST

    Zimbabwe VS Pakistan

    Follow us on

    Zimbabwe VS Pakistan : జింబాబ్వే జట్టుపై పాకిస్తాన్ గెలిచింది. వన్డే సిరీస్ మాదిరిగానే.. టి20 సిరీస్ కూడా దక్కించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ట్రోఫీని అందుకుంది. మంగళవారం జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. జింబాబ్వే విధించిన లక్ష్యాన్ని జస్ట్ 5.3 ఓవర్లలోనే ఫినిష్ చేసేసింది. ఈ మ్యాచ్లో ముందుగా జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. 12.4 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఒకానొక దశలో జింబాబ్వే 37/0 తో పటిష్ట స్థితిలో ఉంది. కానీ 20 పరుగుల వ్యవధిలోనే 10 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ బెన్ నెట్ 21, మరుమణి 16 పరుగులతో నిలకడగా ఆడారు. పాకిస్తాన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 4.2 ఓవర్లలో 37 పరుగులు సాధించారు. కానీ అంతలో ఏమైందో తెలియదు .. జింబాబ్వే ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఫలితంగా ఆ జట్టు 57 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బోర్డర్లలో సూఫీ ముఖీమ్ 2.5 ఓవర్లలో మూడు మాత్రమే రన్స్ ఇచ్చి, ఏకంగా 5 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అబ్బాస్ ఆఫ్రిది రెండు, కెప్టెన్ సల్మాన్ అఘా, హారీస్ రౌఫ్, అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 57 పరుగులు చేసి జింబాబ్వే తన టి20 చరిత్రలో అత్యంత స్కోర్ నమోదు చేసింది. శ్రీలంక జట్టుతో ఈ ఏడాది జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 82 పరుగులు చేసింది. ఇప్పటివరకు అదే అత్యల్ప స్కోర్ గా ఉండేది.

    పాకిస్తాన్ 33 బంతుల్లో..

    జింబాబ్వే విధించిన 57 పరుగుల విజయ లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 33 బంతుల్లోనే చేదించింది. మొత్తంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్లు సయిమ్ అయూబ్ 36, ఓ మైర్ యూసఫ్ 22 పరుగులతో ఆకట్టుకున్నారు. లక్ష్యం స్వల్పం కావడంతో జింబాబ్వే బౌలర్లు కూడా పెద్దగా ఆసక్తిగా అనిపించలేదు. త్వరగా మ్యాచ్ ముగిస్తే వెళ్ళిపోదాం అన్నట్టుగానే వారి హావభావాలు కనిపించాయి. వాస్తవానికి ఈ మ్యాచ్లో జింబాబ్వే భారీ స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. తొలి నాలుగు ఓవర్ల దాకా పరిస్థితి అలాగే ఉండేది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ బౌలర్లు గేర్ మార్చారో అప్పుడే జింబాబ్వే కథ పూర్తిగా మారిపోయింది. వికెట్ల మీద వికెట్లు పడిపోవడంతో జట్టు స్కోర్ నెమ్మదించింది. ఫలితంగా 57 పరుగుల వద్దే ఇన్నింగ్స్ ను ముగించింది. జింబాబ్వే టి20 చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసి చెత్త రికార్డును మూటకట్టుకుంది. అది కూడా స్వదేశంలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించి విమర్శల పాలైంది. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ గెలిచిన పాకిస్తాన్.. టి20 సిరీస్ కోల్పోయింది. అయితే ఆ పరాభవాన్ని జింబాబ్వే జట్టు పై సాధించిన టి20 సిరీస్ విజయంతో భర్తీ చేసింది.