https://oktelugu.com/

WTC Final 2025 : ఇండియా ఆస్ట్రేలియా కోసం న్యూజిలాండ్ ను దెబ్బకొట్టిన ఐసీసీ

ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత్ కోల్పోయింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణంగా వైట్ వాష్ కు గురైంది. దీంతో భారత జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే దారులు సంక్లిష్టంగా మారాయి. దీంతో అత్యంత ఒత్తిడి మధ్య భారత ఆస్ట్రేలియా లోకి అడుగు పెట్టింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 3, 2024 / 10:10 PM IST

    ICC Penalty both teams

    Follow us on

    WTC Final 2025  : ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతోంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 295 పరుగుల తేడాతో విక్టరీని సాధించింది. అయితే ఇంకా ఈ సిరీస్లో నాలుగు టెస్టులు మిగిలి ఉన్నాయి. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ విధానంలో రెండవ టెస్ట్ జరగనుంది. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా సిరీస్ నెగ్గాలి. విజయాలు కూడా అదే స్థాయిలో సాధించాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మిగతా జట్ల సమీకరణాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే కాగలకార్యం గంధర్వులు తీర్చినట్టు.. ఇప్పుడు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే బాధ్యతను ఐసీసీ భుజానికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే బీసీసీఐ జనరల్ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్ గా ఎంపికయ్యారు. 36 సంవత్సరాల వయసులోనే ఐసీసీ చైర్మన్ అయిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. అయితే ఆయన అలా పదవి బాధ్యతలు చేపట్టారో లేదో.. భారత జట్టుకు అన్ని మంచి శకునములే అన్నట్టుగా శుభవార్త వినిపించింది.

    భారత జట్టు నెత్తిన ఐసీసీ పాలు

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలని భారత జట్టు గట్టిగా భావిస్తోంది. గత రెండు సీజన్లలో ఫైనల్ వెళ్ళినప్పటికీ భారత్ ఒకసారి న్యూజిలాండ్, మరోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. దానికంటే ముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలని గట్టిగా అనుకుంటున్నది. అయితే భారత జట్టుకు మార్గం సుగమం చేసేలా ఐసీసీ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు టెస్ట్ సిరీస్ ఆడుతున్నాయి. అయితే ఈ జట్లకు ఐసీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.. క్రైస్ట్ చర్చి వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో స్లో ఓవర్లు వేసినందుకు రెండు జట్ల మ్యాచ్ ఫీజులో 15% కట్ చేసింది. అంతేకాదు రెండు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లను పెనాల్టీగా వేసింది. ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఈ పెనాల్టీ వల్ల ఇంగ్లాండ్ జట్టుకు పెద్దగా నష్టం ఉండదు. కానీ న్యూజిలాండ్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఐసీసీ కోత విధించడం ద్వారా న్యూజిలాండ్ జట్టు ఏకంగా 5వ స్థానానికి దిగజారింది. ఈ సిరీస్ కంటే ముందు న్యూజిలాండ్ శ్రీలంక తో కలిసి సంయుక్తంగా నాలుగు స్థానంలో ఉండేది.. న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ జట్టుతో తదుపరి జరిగే రెండు టెస్టులలో గెలిచినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లే అవకాశం లేదు. న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పర్సంటేజీ ప్రస్తుతం 47.92 గా ఉంది. ఒకవేళ తదుపరి 2 టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఆ పర్సంటేజ్ కాస్త 55.36 కు పెరుగుతుంది. న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూ టి సి ఫైనల్ వెళ్లాలంటే ఇది సరిపోదు.

    దెబ్బతిన్న న్యూజిలాండ్ అవకాశాలు

    ఐసీసీ విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసి అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఇటీవల న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటించింది. జోరు మీద ఉన్న భారత జట్టును నేలకు దించింది. వరుసగా మూడు టెస్టులలో విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే అధికారికంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ నుంచి నిష్క్రమణకు గురయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ చేతిలో 40.75 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ జట్టు ఆరవ స్థానంలో కొనసాగుతోంది. ఇక క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు బ్రూక్ 171 రన్స్ చేశాడు. కార్స్ 10 వికెట్లు సొంతం చేసుకున్నాడు.