
T20 World Cup: టీ 20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ సెమీస్ లో చతికిలపడింది. ఓటమి అంచుల్లో చిక్కుకుంది. దుబాయి వేదికగా ఆస్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఘోర పరాజయంతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో అప్రదిష్టల పాలైంది. దీంతో పాకిస్తాన్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్ రూంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
పాకిస్తాన్ జట్టు సెమీస్ లో ఆస్రేలియా చేతిలో పరాభవం తరువాత ఆటగాళ్లలో మానసిక స్థైర్యం నింపేందుకు కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రయత్నించాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ తన సైన్యానికి ధైర్యం పోసిన మాదిరి తన మాటలతో ఆటగాళ్లలో ఆశలు పెంచాడు. ఓటమి కోరల్లోంచి బయట పడాలని సూచించాడు. సుమారు రెండున్నర నిమిషాల పాటు సాగిన స్పీచ్ లో కెప్టెన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక భవిష్యత్ పై దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. ఓటమికి ఎవరిని బాధ్యుల్ని చేయాల్సిన పనిలేదు. ఓ అద్భుత టీంను పటిష్టం చేయాలి. ఇందుకోసం ఓటమిని మరిచిపోయి విజయాల కోసం శ్రమించాలి. పరాభవం గురించి పట్టించుకోవద్దు. తప్పు ఎక్కడ చేశామో దానిపై దృష్టి సారించొద్దు.
కెప్టెన్ స్పీచ్ అనంతరం కోచ్ లు హేడెన్, ఫిలాండర్, సక్యులిన్ ముస్తాక్ లు కూడా జట్టును ఉత్సాహ పరచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు కూడా జట్టుకు మద్దతు తెలిపారు. పరాజయం పాలైన జట్టుకు విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Also Read: భారత్ తరుఫున ఆడుతూ పాకిస్తాన్ కు సపోర్టా? సానియా మీర్జాపై నెటిజన్ల ఫైర్