Chiru: చిత్ర సీమలో కొత్తగా అడుగుపెడుతున్న నటుల్లో కొంచెం టాలెంట్, వైవిధ్యం కనిపించినా.. వారిని చూసి మురిసి పోయి ప్రోత్సహించడం తనకున్న బలమైన బలహీనత అన్నారు మెగాస్టార్ చిరంజీవి. కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు బెస్ట్ విషెస్ తెలిపారు చిరు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
What better can happen when the night before your movie releases @KChiruTweets sir himself sends you his best wishes 😍
Thank you is a small word sir 🙏🏼
Starting from tomorrow I promise to deliver the best work possible and make myself worthy of MEGASTAR speaking about me . pic.twitter.com/rF3AC0M3uk— Kartikeya (@ActorKartikeya) November 11, 2021
ఈ క్రమంలోనే చిరు మాట్లాడుతూ.. అసలు ఎవరి సాయం లేకుండా.. స్వయంకృషితో ఎదిగిన వాళ్లంటే తనకెంతో అభిమానమని అన్నారు. సినిమా అనే రంగుల ప్రపంచంలో ఆ స్వయంకృషి వల్లే తాను కూడా ఎదిగినట్లు తెలిపారు. ఆ తారకమంత్రంతోనే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని అన్నారు. ప్రస్తుతం కెరీర్లో ముందడుగు వేస్తున్న యంగ్ హీరో కార్తికేయ అని అన్నారు. తనకు కూడా కార్తికేయ పట్ల సోదరభావం ఉందని తెలిపారు.
ఈ విధంగా మాట్లాడుతూ.. నాకు చాలా ఇష్టమైన నా సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్‌తో ఇప్పుడు కార్తికేయ సినిమా తీశాడు. ఆ సినిమా ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. కార్తికేయ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చిరు పేర్కొన్నారు. తాజాగా, దీనికి సంబంధించిన వీడియోను కార్తికేయ ట్వీట్ చేస్తూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి మంచి సినిమాలు చేస్తానని అన్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Chiranjeevi best wishes for hero karthikeya movie raja vikramrka
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com