Pakistan Players: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ లాంటిది. ఆ ఆట ఆడేవారు జెంటిల్మెన్ లాగానే ప్రవర్తించాలి. అలా కాకుండా బి గ్రేడ్ వ్యక్తులాగా ప్రవర్తిస్తే ఆటకు చెడ్డ పేరు వస్తుంది.. చూసేవారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తాము క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి ప్లేయర్లపై పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవారు. కొంతకాలానికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి పాకిస్తాన్ ప్లేయర్లు చేరిపోయారు.
ఇటీవల ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్లు 6-0 అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. దీనికి ఆరు రఫెల్ జెట్లను కూల్చి వేసినట్టు అని అర్థమట. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. రౌఫ్ ప్రవర్తన పట్ల టీం ఇండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆటగాడు క్రికెట్ ఆడుతుంటే.. దానికి బదులుగా ఇలా వ్యవహరించడం ఏంటి అని టీం ఇండియా అభిమానులు ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇక జన్మలో మారరని. మారే అవకాశం కూడా లేదని వ్యాఖ్యానించారు. పురుష క్రికెటర్ల అహంకారమే అలా ఉంటే.. మహిళ క్రికెటర్లు కూడా అలానే వ్యవహరిస్తున్నారు. పురుష క్రికెటర్లకు తలకాయ లేదనుకుంటే.. మహిళా క్రికెటర్లు కూడా అలానే వ్యవహరిస్తూ.. తాము కూడా అదే కేటగిరి అని నిరూపించుకుంటున్నారు.
Also Read: బీసీసీఐ పెద్దల ఒత్తిడి.. బయటికి వచ్చేసిన శ్రేయస్ అయ్యర్.. కీలక నిర్ణయం..
సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో పాకిస్తాన్ ఉమెన్ ప్లేయర్స్ సిద్రా అమీన్, నష్రా సందూ చేతి వేళ్ళతో ఆరవ నెంబర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ ఫోటోలను పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా.. భారత అభిమానులు ఏకిపారేస్తున్నారు. ఇలాంటి చంచలమైన స్వభావం ఉన్న వ్యక్తులు క్రికెట్ ఎలా ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు క్రికెట్ ఆటకు సరిపోరని దెప్పిపొడుస్తున్నారు.