Shreyas Iyer Quit: బిసిసిఐ బయటికి గొప్పగానే కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది ప్లేయర్లపై బీసీసీఐ పెద్దలు కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుంటారు. వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటారు. అలా బీసీసీఐ ద్వారా ఇబ్బంది పడుతున్న ప్లేయర్లలో శ్రేయస్ అయ్యర్, ముందు వరసలో ఉంటాడు.
అయ్యర్ అద్భుతమైన ఆటగాడు. సూపర్ మాన్ తరహాలో బ్యాటింగ్ చేస్తుంటాడు. అదే స్థాయిలో ఫీల్డింగ్ కూడా చేస్తుంటాడు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా.. అయ్యర్ ఎంతో గొప్ప ఆటగాడు అయినప్పటికీ.. అప్పుడప్పుడో మేనేజ్మెంట్ నిబంధనలు అతిక్రమించాడనే అభియోగంతో.. మేనేజ్మెంట్ ఇప్పటికీ అతని మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోంది. ప్రతి సందర్భంలోనూ ఇబ్బంది పెడుతోంది. టి20 వరల్డ్ కప్ లో అవకాశం ఇవ్వలేదు. ఆసియా కప్ లో అవకాశం ఇవ్వలేదు. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించి ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇన్ని అర్హతలు ఉన్నప్పటికీ అయ్యర్ విషయంలో బీసీసీఐ పెద్దలు మొదటి నుంచి కూడా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్ లో టీమిండియా కు అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే తొలి టెస్ట్ లో అతడు విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లలో 8, 13 పరుగులు చేశాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్ లో అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం వల్ల అవుట్ అయ్యాడు. అయితే అయ్యర్ అవుట్ కావడం.. గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోవడంతో మేనేజ్మెంట్ కు అది తీవ్రమైన తప్పులగా అనిపించింది. ఏం జరిగిందో తెలియదు కానీ శ్రేయస్ అయ్యర్ వెంటనే నొచ్చుకున్నాడు.
వ్యక్తిగత కారణాలను సాకుగా చూపిస్తూ అనధికారిక టెస్ట్ సిరీస్ నుంచి బయటికి వచ్చాడు. వ్యక్తిగత కారణాలని బయటికి చెబుతున్నప్పటికీ.. మేనేజ్మెంట్ వ్యవహార శైలి వల్ల తట్టుకోలేక వచ్చినట్టు తెలుస్తోంది. అయ్యర్ ఆకస్మిక నిష్క్రమణ పట్ల అభిమానులు మేనేజ్మెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. త్వరలోనే వెస్టిండీస్ జట్టుతో టీమిండియా త్వరలో సిరీస్ ఆడబోతోంది.. దానికి అయ్యర్ నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతోంది. దాని కంటే ముందు ఈ పరిణామం జరగడం పట్ల అతడు వెస్టిండీస్ సిరీస్ లోనూ కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.