Pawan Kalyan Bollywood Market: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికి లేనటువంటి గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి ఇక మీదట ఆయన సినిమాలు చేసే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు కమిట్ అయిన సినిమాలను చాలా కాన్ఫిడెంట్ గా చేసి సూపర్ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు ఓజీ సినిమా సక్సెస్ అయితే మాత్రం డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ని సాధించిన వాడు అవుతాడు లేకపోతే మాత్రం చాలా వరకు ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ కి ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం…
హిందీలో సైతం టిక్కెట్లు పెట్టిన వెంటనే మొత్తం బుకింగ్స్ అయిపోవడం నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి…ఇక దీన్ని బట్టి బాలీవుడ్ లో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ టాప్ లెవల్లో ఉందని చెప్పడానికి ఈ ఒక్క సంఘటనను మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. మరి ఏది ఏమైనా కూడా ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ని ఎలా ఆదరిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…