India vs Pakistan: పాకిస్తాన్ దేశం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన లీగ్ మ్యాచ్ నుంచి పాకిస్తాన్ తప్పుకోవడం పట్ల క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ దేశం నిర్ణయం నెత్తి మాసినదని చెబుతున్నారు.
పాకిస్తాన్ దేశం తీసుకున్న నిర్ణయం పట్ల సగటు క్రికెట్ అభిమానులకి కాదు.. మాజీ క్రికెటర్లలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా చేరిపోయాడు. పాకిస్తాన్ దేశం తీసుకున్న నిర్ణయం పట్ల అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ దేశం క్రికెట్ వ్యవహారాలలో వేలు పెట్టడం ఏమాత్రం బాగోలేదని స్పష్టం చేశాడు . క్రికెట్లో ఇలాంటి పద్ధతులు మంచివి కావని పేర్కొన్నాడు.
” భారత చేతిలో ఓడిపోతామని భయం నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ బహిష్కరణ అనే ఆస్త్రాన్ని ఉపయోగిస్తుంది. ముఖాముఖి పోరులో వారు భారతదేశాన్ని ఓడించలేరు. ఈ విషయం వారికి తెలుసు. అందువల్లే ఈ డ్రామాలు మొదలుపెట్టారు. వాస్తవాన్ని కప్పి పెట్టడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇవి అంతగా సఫలీకృతం కాలేవు. ఎందుకంటే క్రికెట్లో భారత్ బలంగా ఉంది. ఈ విషయం కూడా పాకిస్తాన్ జట్టుకు తెలుసు. అందువల్లే ఓడించలేకుండా ఇలాంటి నాటకాలు ఆడుతోందని” పాంటింగ్ పేర్కొన్నాడు.
పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ లో ఏకపక్ష విధానాల ఉండకూడదని.. ముఖ్యంగా ప్రభుత్వాల ప్రమేయం క్రికెట్లో ఒక స్థాయి వరకు ఉంటే సరిపోతుందని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయింది. అక్కడ క్రికెట్ మేనేజ్మెంట్ కూడా డబ్బుల కోసం చేయి చాపే దుస్థితి ఎదురవుతోంది. ఇలాంటప్పుడు భారత్ లాంటి జట్టుతో పోటీపడి నాలుగు డబ్బులు సంపాదించుకోవాల్సింది పోయి.. పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల ఏకపక్ష నిర్ణయాలతో పూర్తిగా సంక్షోభంలోకి కూరుకు పోతోంది.