Nari Nari Naduma Murari : వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో పూర్తిగా మార్కెట్ కోల్పోయిన హీరో శర్వానంద్(Sharwanand), మళ్లీ కం బ్యాక్ ఇస్తాడని, భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈ సంక్రాంతికి ఆయన నాలుగు సినిమాలతో పోటీ పడి మరీ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ వద్ద డీసెంట్ స్థాయి రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి 18వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల నుండి 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సంక్రాంతికి 5 సినిమాలు విడుదలైతే కేవలం మూడు సినిమాలు మాత్రమే ఇప్పటికీ థియేటర్స్ నుండి షేర్ వసూళ్లను రాబడుతున్నాయి. అందులో ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఒకటి. 18 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి 5.36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా సీడెడ్ నుండి 1.51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఈ చిత్రానికి రాగా, ఆంధ్రా ప్రాంతం నుండి 7.55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 14.42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు ఓవర్సీస్ నుండి 3.29 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 18.87 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఈ చిత్రానికి 35.25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రానికి విడుదలకు ముందు 10.25 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విడుదల తర్వాత ఏకంగా 8.6 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. శివరాత్రి వరకు రన్ వచ్చే అవకాశం ఉండడం తో ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 20 కోట్ల షేర్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్స్ లో బాగా ఆడుతున్నప్పటికీ అప్పుడే ఓటీటీ లో విడుదల చేయడం పై సోషల్ మీడియా లో కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు