Homeక్రీడలుక్రికెట్‌PAK VS ENG : పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో...

PAK VS ENG : పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతటి దారుణం మరే జట్టు నమోదు చేయలేదు

PAK VS ENG :  ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ దారుణమైన ఓటమితో పాకిస్తాన్ జట్టు అత్యంత దయనీయ స్థితిలో నిలిచింది. దారుణమైన రికార్డును తన పేరు మీద లిఖించుకుంది. 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టూ నమోదు చేయలేని దారుణమైన రికార్డును సృష్టించింది. తొలి ఇన్నింగ్స్ లో 550 కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ.. ఇన్నింగ్స్ తేడాతో పాకిస్తాన్ ఓడిపోవడం ఆ దేశ అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. బహుశా పాకిస్తాన్ ఇలా ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఇక రెండు జట్లు 550 కంటే ఎక్కువ పరుగులు చేసిన సమయంలో ఫలితం తేలిన రెండవ మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం.. ఇంగ్లాండ్ జట్టుతో 2022లో జరిగిన ఓ మ్యాచ్లో పాకిస్తాన్ 74 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.

రెండవ ఇన్నింగ్స్ లో 152/6 ఓవర్ నైట్ స్కోర్ తో పాకిస్తాన్ ఆటను మొదలుపెట్టింది. కేవలం 68 పరుగులు మాత్రమే జత చేసి ఓటమిపాలైంది. రెండవ ఇన్నింగ్స్ లో 220 పరుగులకు కుప్ప కూలింది. సల్మాన్(63), అమీర్ (55*) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పాకిస్తాన్ చివరి బ్యాటర్ అబ్రార్ అహ్మద్ జ్వరం వల్ల బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో అంపైర్లు పాకిస్తాన్ జట్టును ఆలౌట్ అయినట్టు ప్రకటించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అట్కిన్సన్ , వోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ చెట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 556 రన్స్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 823/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది..బ్రూక్ 317, రూట్ 262 రన్స్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు 267 రన్స్ లీడ్ లభించింది. అయితే ఆ ఆధిక్యాన్ని కూడా పాకిస్తాన్ జట్టు రీచ్ కాలేకపోయింది. బ్రూక్ ట్రిబుల్ సెంచరీ చేసిన బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు. ఇక స్వదేశంలో పాకిస్తాన్ జట్టుకు ఇది వరుసగా ఆరవ ఓటమి. గత తొమ్మిది టెస్టులలో పాకిస్తాన్ జట్టు ఏడింట్లో ఓడిపోయింది. 2022 మార్చి నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ జట్టు సొంత గడ్డపై ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. మొత్తం 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా.. ఏడింట్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్ లు డ్రా అయ్యాయి. ఈ టెస్టులో 556 రన్స్ చేసినప్పటికీ ఓడిపోవడం పాకిస్తాన్ జట్టు అభిమానులకు రుచించడం లేదు.

400+ పరుగులు చేసినా ఓటమి తప్పలేదు..

2023లో ఐర్లాండ్ శ్రీలంక జట్లు గాలే వేదికగా తలపడ్డాయి. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 492 రన్స్ చేసినప్పటికీ.. ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.. 2016లో చెన్నై వేదికగా టీమిండియా పై ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 477 రన్స్ చేసినప్పటికీ.. ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో.. ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది. 2011లో కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 463 రన్స్ చేసింది. అయినప్పటికీ ఇన్నింగ్స్ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2010లో సెంచూరియన్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 459 రన్స్ చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular