Haris Rauf is a RAW agent: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ పరిస్థితుల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ.. గెలుపును దక్కించుకుంది. తద్వారా ఆసియా కప్ చరిత్రలో ఎక్కువసార్లు ట్రోఫీలు అందుకున్న జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. భారత జట్టు సాధించిన విజయం మనదేశంలో హర్షాన్ని నింపుతుండగా.. పాకిస్తాన్ ఓటమి ఆ దేశంలో నిరసనలకు కారణమవుతోంది. ఆ జట్టు మాజీ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో ప్లేయర్లపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఫైనల్ మ్యాచ్లో హారిస్ రౌఫ్ బౌలింగ్ పై సీనియర్ ప్లేయర్లు విమర్శలు చేస్తున్నారు. అతడు నిరంతరం పరుగులు ఇవ్వడం ద్వారా టీం ఇండియాను గెలిపించాడని.. ఒకరకంగా రా ఏజెంట్ లాగా పని చేశాడని ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ హరీస్ రౌఫ్ పై చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.. అతను భారతదేశ గూడచారి అని బాబర్ పోస్ట్ చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే అది బాబర్ చేసింది కాదని.. పాకిస్తాన్ అభిమాని ఒకరు బాబర్ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి.. అలా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో రౌఫ్ 3.4 ఓవర్లు వేశాడు. 50 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీనికి తోడు చివరి ఓవర్ లో అతడి ఏకంగా 10 కి మించి పరుగుల వరకు ఇచ్చాడు. దీంతో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. అంతేకాదు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 2022లో టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిడియాతో జరిగిన మ్యాచ్లో అతడు ఇదే విధంగా బౌలింగ్ చేశాడు. నాడు విరాట్ కోహ్లీ అతడి బౌలింగ్ మొత్తాన్ని చీల్చి చెత్తకుప్పలో పడేశాడు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో రౌఫ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. అతడు భారత జట్టుకు ఏజెంట్ లాగా పని చేస్తున్నాడని.. పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారకూడని బాబర్ పేరుతో ఓపెన్ చేసిన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ కనిపించింది. అయితే అది బాబర్ చేసింది కాదని.. పాకిస్తాన్ దేశస్థుడు చేసిందని తెలుస్తోంది. దీనిపై కేసు కూడా నమోదయిందని.. త్వరలోనే విచారణ కూడా జరుగుతుందని సమాచారం.
Pakistan ex-captain Babar Azam’s
He says Haris Rauf is a RAW agent
Who always gives runs against India
Even against new players like Tilak Verma and Shivam Dube.
Whole Pakistan got mad after losing Asia Cup and 11 Air Bases pic.twitter.com/LbIyIzFl5L
— Yanika_Lit (@LogicLitLatte) September 28, 2025