Tilak Varma success story: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు మొత్తం విఫలమైనప్పటికీ.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ నిలబడ్డాడు. టీమ్ ఇండియాను గెలిపించాడు. తగ్గాల్సిన చోట తగ్గి.. నెగ్గాల్సిన చోట నెగ్గి.. టీమిండియా కు ఊహించని విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోతున్నచోట.. మైదానం నుంచి సపోర్ట్ లభించని చోట.. తను మాత్రం నిలబడి అదరగొట్టాడు. అంతేకాదు సంజు శాంసన్, శివం దుబే తో కలిసి నాలుగు, ఐదు వికెట్లకు అద్భుతమైన భాగస్వామ్యాలు నిర్మించాడు.
జట్టుకు విజయాన్ని అందించడం మాత్రమే కాదు చివరి వరకు నిలబడి తనలో ఉన్న అసలు సిసలైన ఆటగాడిని భారత అభిమానులకు పరిచయం చేశాడు. పాకిస్తాన్ మీద అద్భుతమైన విజయం సాధించడానికి ప్రధాన కారణమైన తిలక్ వర్మపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. సోమవారం దుబాయ్ నుంచి ఇండియా వచ్చిన అతనికి హైదరాబాద్ నగరంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు అతనితో ఫోటోలు దిగడానికి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించారు. తనను చూసి ఎందుకు వచ్చిన అభిమానులకు అభిమానం చేసుకుంటూ తిలక్ వర్మ ముందుకు సాగాడు.
తిలక్ వర్మ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ కాలేదు. అతడు ఈ స్థాయి దాక రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నిద్ర లేని రాత్రులు గడిపాడు. తిలక్ వర్మ తండ్రి ఒక ఎలక్ట్రిషన్. అతడికి శిక్షణ ఇప్పించడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. కనీసం బ్యాట్ కూడా కులం లేని పరిస్థితి ఉండేది. తిలక్ వర్మకు చిన్నప్పటి కోచ్ సలాం బయాష్ అన్ని విధాలుగా అండదండలు అందించాడు. శిక్షణ ఇవ్వడంతో పాటు.. ప్రయాణ ఖర్చులు కూడా భరించాడు. భోజనం పెట్టించాడు. వసతి కల్పించాడు. అతడు వైఫల్యమైన ప్రతి సందర్భంలోనూ విజయం సాధించే విధంగా తర్ఫీదు ఇచ్చాడు. అంతేకాదు అతని మీద విపరీతమైన నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకమే నేడు తిలక్ వర్మను తిరుగులేని ఆటగాడిని చేసింది.