Homeక్రీడలుPakistan Cricketers: వాళ్లకు సిక్స్‌ కొట్టడం చేతకావట్లేదట.. రంగంలోకి పాకిస్తాన్‌ సైన్యం!

Pakistan Cricketers: వాళ్లకు సిక్స్‌ కొట్టడం చేతకావట్లేదట.. రంగంలోకి పాకిస్తాన్‌ సైన్యం!

Pakistan Cricketers: పాకిస్తాన్‌ క్రికెటర్లు సిక్సర్లు కొట్టలేకపోతున్నారట. బాల్‌ను బౌండరీ అవతలకు వేయడంలో విఫలమవుతున్నారట. దీంతో పీసీబీ చైర్మన్‌ మొహసీన్‌ నక్వీకి చిర్రెత్తుకొచ్చిందట. తాను మ్యాచ్‌లు చూస్తున్నంతసేపు ఒక్కరు కూడా బంతిని స్టాండ్‌లోకి పంపించలేకపోయారని స్వయంగా ఎద్దేవా చేశారు. దీంతో వారికి సైన్యంతో శిక్షణ ఇప్పించాలని డిసైడ్‌ అయ్యారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తమ క్రికెటర్లు ఓ సైనిక క్యాంపులో సాధన చేస్తారని ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో క్రికెటర్లను ఉద్దేశించి ఈవిషయం తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పీఎస్‌ఎల్‌ టోర్నమెంట్‌ పూర్తికాగానే దాదాపు పది రోజులపాటు క్యాంపు ఉంటుందని చెబుతున్నారు.

ఫిట్‌నెస్‌ మెరుగు పర్చేందుకు..
‘‘నేను లాహోర్‌ మ్యాచ్‌ను వీక్షిస్తుండగా.. ఒక్కరు కూడా బంతిని స్టాండ్స్‌లోకి తరలించలేకపోయారు. ఎప్పుడైనా ఆ స్థాయి సిక్సర్లు కనిపిస్తే.. కచ్చితంగా విదేశీయులే వాటిని బాదారనుకొంటాను. అందుకే ప్రతీ ఆటగాడి ఫిట్‌నెస్‌ మెరుగుపర్చేందుకు బోర్డు ఓ ప్లాన్‌ సద్ధం చేయలని కోరుతున్న. మీరు దాని ప్రకారం శ్రమించండి. వరుసగా న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచకప్‌ సిరీస్‌లు ఉన్నాయి. దీనాని చూసి ఇప్పుడు సాధన చేయాలి. మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8 వరకు మేము కాకుల్‌ (మిలటరీ అకాడమీ)లో క్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిక్షణలో పాక్‌ సైన్యం భాగస్వామి అవుతుంది. వారు కచ్చితంగా మీకు సాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని క్రికెటర్లు ఉద్దేశించి నక్వీ వ్యాఖ్యానించారు.

దేశానికి ప్రాధాన్యం ఇవ్వండి..
క్రికెటర్లు కచ్చితంగా వేశం కోసం జాతీయ జట్టుకు ఆడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నక్వీ సూచించారు. ఇటీవల స్టార్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ సెంట్రల్‌ కాం6టాక్టును బోర్డు తొలగించింది. అతను జూన్‌ 30 వరకు విదేశాల్లో టీ20 లీగులు ఆడకుండా నిషేధం విధించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌ జట్టులో క్రికెటర్లకన్నా రెజ్లర్లు ఎక్కువగా కనిపిస్తున్నారని మాజీ ఫేసర్‌ ఆఖిబ్‌ జావెద్‌ మూడేళ్ల క్రితమే ఎద్దేవా చేశాడు. అప్పట్లో వారి ఆటతీరు దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పుడు నక్వీ కూడా ఆదే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version