Haris Rauf : నన్ను గెలికితే ఇలానే ఉంటుంది.. ఉరికించి, ఉరికించి కొడతాను.. పాక్ క్రికెటర్ సంచలన పోస్ట్

Haris Rauf హద్దు దాటితే మాత్రం నేను తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాలి. అది చాలా హుందాగా ఉంటుందని" రౌఫ్ ట్విట్టర్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.

Written By: NARESH, Updated On : June 18, 2024 10:00 pm

Haris Rauf

Follow us on

Haris Rauf : అమెరికాలో ఓ అభిమాని పై గొడవ పడిన పాకిస్తాన్ ఆటగాడు హ్యారీస్ రౌఫ్ వ్యవహార శైలిపై సామాజిక మాధ్యమాలలో తెగ చర్చ నడుస్తోంది. ఆ అభిమాని పై అతడు దాడికి దిగిన దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.. ఈ ఘటన అనంతరం రౌఫ్ స్పందించాడు..” నా కుటుంబం జోలికి వస్తే ఇలానే జరుగుతుంది. నన్ను అసలు గెలకొద్దు. ఉరికించి ఉరికించి కొడతాననే” అర్థం వచ్చేలా ట్విట్టర్లో సుదీర్ఘ ట్వీట్ చేశాడు..

టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. వరల్డ్ కప్ కంటే ముందు ఆ జట్టు పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ట్రైనింగ్ తీసుకుంది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో పేలవమైన ఆట తీరు ప్రదర్శించింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను చేజేతులా కోల్పోయింది. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మూడు t20 మ్యాచ్ సీరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. మొత్తంగా తన ఆటతీరును ఐర్లాండ్ జట్టుతో సమానం చేసుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్ ఆటగాళ్లపై ఆ దేశ అభిమానులు నమ్మకం ఉంచారు. మెరుగ్గా ఆడతారని భావించారు. కానీ అభిమానుల నమ్మకాన్ని పాకిస్తాన్ ఆటగాళ్లు వమ్ము చేశారు. అమెరికా చేతిలో సూపర్ ఓవర్ లో ఓడిపోయారు. భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒత్తిడికి తలొగ్గారు. చివరికి కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

లీగ్ దశ నుంచే పాకిస్తాన్ నిష్క్రమించడంతో.. ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు సైతం జట్టు ఆట తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.

పాకిస్తాన్ జట్టు ఆట తీరు సరిగా లేకపోవడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ క్రమంలోనే అమెరికాలో సేద తీరుతున్న పాకిస్తాన్ ఆటగాడు రౌఫ్ ను అభిమాని ట్రోల్ చేశాడు. దీంతో రౌఫ్ పట్టరాని ఆగ్రహానికి గురయ్యాడు.. ఆ అభిమాని భారతదేశానికి చెందిన వాడని అనుమానించి, కొట్టేందుకు దూసుకెళ్లాడు. అదంతా చూస్తున్న రౌఫ్ భార్య.. గొడవ వద్దని వారించింది. అయినప్పటికీ కోపం తట్టుకోలేక రౌఫ్ సమయ మనం కోల్పోయాడు. అభిమాని ఆగ్రహాన్ని అర్థం చేసుకొని.. అతడికి తగ్గట్టుగా సమాధానం చెప్పాల్సింది పోయి.. వీధి రౌడీ లాగా వ్యవహరించాడు. ఇక ఈ సంఘటన మొత్తాన్ని అక్కడ ఉన్న వారంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దెబ్బకు ఇది కాస్త చర్చకు దారి తీస్తోంది.

ఈ గొడవ ముగిసిన అనంతరం రౌఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ” నన్ను హేళన చేస్తే భరిస్తాను. కానీ నా కుటుంబం జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను. వాస్తవానికి ఈ విషయాన్ని పెద్దలు చేయొద్దు అనుకున్నాను. కానీ వీడియో బయటికి వచ్చేసింది. ఇంత జరిగినప్పటికీ మౌనంగా ఉంటే ఉపయోగం లేదు. ప్రజా బాహుళ్యంలో ఉన్న వ్యక్తులపై ఏదైనా జరిగితే వెంటనే మీడియాలోకి వచ్చేస్తుంది. అందువల్లే నేను సమాధానం చెప్పాల్సి వస్తోంది. నా జోలికి వస్తే పెద్దగా ఇబ్బంది లేదు. వారు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలను. కానీ నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే నేను భరించలేను. హద్దు దాటితే మాత్రం నేను తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాలి. అది చాలా హుందాగా ఉంటుందని” రౌఫ్ ట్విట్టర్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.