Kalki 2898 AD : కల్కి కథ ఏంటి? రివీల్ చేసిన నాగ్ అశ్విన్.. గూస్ బాంబ్స్ అంతే

Kalki 2898 AD ఇక దేవుడు ప్రతి యుగం లో ఏదో ఒక అవతారం లో వచ్చి ఆ కలి అనేవాడిని చంపేస్తున్నాడు. ఇక ఈ కలియుగంలో కూడా కలి అనే వాడు వచ్చి వాడు చేసే అక్రమాలను అంతం చేయడానికే కల్కి అవతరిస్తాడు

Written By: NARESH, Updated On : June 18, 2024 10:13 pm

Kalki 2898 AD Director Nag Ashwin revealed the story of Kalki

Follow us on

Kalki 2898 AD : ఇక ప్రస్తుతం ఇండియా వైడ్ గా జనాలు ఎక్కడ చూసిన కూడా కల్కి సినిమా జపం చేస్తున్నారు. ఇక ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అందుకే సినిమా యూనిట్ సినిమా ప్రమోషన్స్ ను విస్తృత స్థాయి లో చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ నుంచి రోజుకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. దాంతో ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో పెరిగిపోయాయనే చెప్పాలి.

ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అద్భుతాలను సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు అయిన ‘నాగ్ అశ్విన్’ సినిమా స్టోరీ మొత్తం రివిల్ చేశాడు. అయితే ఆయన ఈ సినిమా స్టోరీ చెబుతూ ఇక ఇప్పటి వరకు పురాణాల్లో మనం చూసిన క్యారెక్టర్లన్నింటికీ ఇది చివరి వర్షన్ గా వస్తుందని చెప్పాడు. ఇక అలాగే ఇక చిన్నప్పటి నుంచి తను పాతాళభైరవి, ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి సినిమాలు చూస్తూ పెరగడట.. ఇక హాలీవుడ్ లో స్టార్ వార్స్ లాంటి సినిమాలను చూసినప్పుడు మాత్రం అంత టెక్నాలజీ ని వాడుకొని వాళ్ళు అలాంటి సినిమాలు చేసినపుడు మనం కూడా అలాంటి సినిమాలు చేయొచ్చు కదా అనే ఉద్దేశ్యం తోనే ఒక భారీ స్కేల్ తో ఈ సినిమాని రూపొందించడానికి నాగ్ అశ్విన్ శ్రీకారం చుట్టాడట…

ఇక కలియుగాంతం మొత్తానికి ఈ సినిమానే ఎండ్ అవ్వాలి అనే ఉద్దేశ్యం తో సినిమా స్టోరీ ని స్టార్ట్ చేసి ఇందులో అన్ని దేశాల ఇన్వాల్వ్ మెంట్ ఉండే విధంగా కథను రాసుకుంటూ వచ్చారట. అలా ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని ఒక కొలిక్కి అయితే తీసుకొచ్చాడు. ఇక దేవుడి అవతారాలను చూసుకుంటే శ్రీకృష్ణ అవతారంతో శ్రీ మహా విష్ణువు అవతారాలు అన్ని ముగుస్తాయి. ఇక కలియుగంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను అంతం చేయడానికి కల్కి వస్తాడని మహాభారతంలో తెలియజేశారు. ఇక దానికి తగ్గట్టుగానే కలి అనే రాక్షసుడు ప్రతి అవతారంలో ఏదో ఒక రూపంలో వస్తున్నాడు.

ఇక దేవుడు ప్రతి యుగం లో ఏదో ఒక అవతారం లో వచ్చి ఆ కలి అనేవాడిని చంపేస్తున్నాడు. ఇక ఈ కలియుగంలో కూడా కలి అనే వాడు వచ్చి వాడు చేసే అక్రమాలను అంతం చేయడానికే కల్కి అవతరిస్తాడు అనేదే మెయిన్ థిమ్ గా పెట్టుకొని తను మొత్తం కథను రాసుకున్నట్టుగా తెలియజేశాడు… ఇక నాగ్ అశ్విన్ చెప్పిన ఈ కథని తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి…