Pakistan Vs India Asia Cup 2025: ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు తర్వాత టీమిండియా సారథి సూర్య కుమార్ యాదవ్, శివం దుబే పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి నిరాకరించారు. విజయం సాధించిన తర్వాత నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు. దీంతో వివాదం చెలరేగింది. ఈ చర్యను భారత జట్టు ప్లేయర్లు సమర్ధించుకున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లు, యాజమాన్యం మాత్రం తప్పు పట్టింది. ఆదివారం మ్యాచ్ ముగిసిన నాటి నుంచి మొదలుపెడితే సోమవారం వరకు ఈ ఘటనపై రకరకాల చర్చలు, వ్యాఖ్యలు వినిపించాయి.
Also Read: రవి అస్తమించని బ్రిటీష్ రాజ్యంలో పరిస్థితి తలకిందులు ఎందుకైంది?
భారత జట్టు ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పు పట్టింది. ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లింది. భారత జట్టు తీరు సరికాదు అంటూ ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫర్ గా ఉన్న యాండి ఫై క్రాఫ్ట్ ను తొలగించాలని డిమాండ్ చేసింది. ఒకవేళ అతడిని గనుక తొలగించకపోతే యూఏఈ తో జరిగే మ్యాచ్ తాము ఆడబోమని.. ఆసియా కప్ నుంచి బయటికి వెళ్లిపోతామని బెదిరించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఐసిసి కూడా స్పందించింది. పాకిస్తాన్ యాజమాన్యం చేసిన వ్యాఖ్యలను icc తోసిపిచ్చింది.. “షేక్ హ్యాండ్ ఇచ్చే విషయం రిఫరి పరిధిలో ఉండదు. అందులో మ్యాచ్ రిఫరీ కి సంబంధం ఉండదు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్ లో లేదని” ఐసీసీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు తెలుస్తోంది. గంభీర్ ఆటగాళ్లకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడని.. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ గెలిచిన తర్వాత శివం దుబే తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. జాతీయ మీడియా మాత్రం గంభీర్ ప్లాన్ ఇదంతా అంటూ తన కథనాలలో స్పష్టం చేసింది.. అయితే భారత్ మీద వ్యతిరేక ప్రచారం చేయాలని పాకిస్తాన్ జట్టు భావించినప్పటికీ.. ఐసీసీ తోసిపుచ్చడంతో పాక్ ఆటలు సాగలేదు. దీంతో మరోసారి దాయాది జట్టు పరువు అడ్డంగా పోయింది.