Today 16 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు గణనీయమైన ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మరి కొన్ని రాశుల వారు డబ్బు వ్యవహారాలు జరిపితే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కంటే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని రంగాల వారికి అదృష్టం వహించనుంది. ఉద్యోగులు అనుకున్న దాని కంటే ఎక్కువగా ప్రయోజనాలు పొందుతారు. శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలను వాడకుండా ఉండాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కొత్త వ్యక్తులను నమ్మొద్దు. ఎవరితోనైనా ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఎక్కువగా గొడవ పడకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : మీ రాశి వ్యాపారులు పెద్దల సలహాతో కొత్తపెట్టబడిన పెడతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేపట్టి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తారు. విద్యార్థులకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు తోటి వారి ప్రోత్సాహం ఉంటుంది. అనుకున్న పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి వివాహా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా పని చేయాలి. అధికారులతో ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులకు అనుకొని అదృష్టం వరించడం. గతంలో దరఖాస్తు చేసుకున్న రుణం మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మంజూరు అవుతాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యా రాశి వారు కష్టపడి పనిచేయడం వల్ల సరైన ఫలితాలను పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది. అయితే కొందరి మద్దతుతో కంపెనీల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన ఓపికతో పూర్తి చేయాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఉంటుంది. అయితే తోటి వారితో సంయమనం పాటించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీగల నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు లక్ష్యం కోసం కష్టపడాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఈరోజు కొన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువగా ధన లాభం పొందుతారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు ధైర్యంగా కొత్త పెట్టుబడులు పెడతారు. ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారంలో ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా ఉంటారు. అయితే వీరికి అధికారుల నుంచి కూడా మద్దతు ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేసిన వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఒక ప్రాజెక్టు కోసం అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారం లాభాల పంట పండిస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. అదనపు ఆదాయం కోసం చూసేవారు శుభవార్తలు వింటారు