https://oktelugu.com/

Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు ముప్పు బాబర్, ఆఫ్రిది నుంచి కాదు.. వాళ్ళే ప్రమాదకరమట..

ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions trophy) నిర్వహిస్తోంది. పాకిస్తాన్ ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది. 1996 లో ప్రపంచ కప్ కు సహ ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్.. దాదాపు 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ నిర్వహించే మెగా టోర్నికి ఆతిథ్యం ఇస్తోంది. భద్రత కారణాలు, రాజకీయ వైరుధ్యాల వల్లభారత్ పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం లేదు. హైబ్రిడ్ మోడ్ విధానంలో దుబాయ్ వేదికగా మ్యాచులు ఆడనుంది.

Written By: , Updated On : February 18, 2025 / 01:47 PM IST
Champions Trophy 2025

Champions Trophy 2025

Follow us on

Champions Trophy 2025 : చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా పాకిస్తాన్, భారత్ (IND vs PAK) తలపడనున్నాయి. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు పాకిస్తాన్ జట్టుపై భారత్ దే పై చేయి. కానీ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాకిస్తాన్ విజయం సాధించింది. హోరాహోరీగా సాగాల్సిన మ్యాచును ఏకపక్షంగా మార్చింది. 180 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అయితే ఈసారి ఎలాగైనా పాకిస్తాన్ జట్టును ఓడించి 2017 నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. హై వోల్టేజ్ పోరుగా భావిస్తున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మాజీ పాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ” భారత జట్టుతో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, పేస్ బౌలర్ నసీంషా ఎక్స్ ఫ్యాక్టర్ గా మారతారు. భారత్ తో జరిగే మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారి జాబితాలో నేను కూడా ఉన్నాను. ఈ మ్యాచ్ లో మహమ్మద్ రిజ్వాన్ నుంచి టీమ్ ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది. పాకిస్తాన్ జట్టుకు అతడు కీలక అస్త్రంగా మారదు.. ఐసీసీ నిర్వహించిన ఈవెంట్లలో భారత జట్టుపై అతడికి మెరుగైన రికార్డు ఉంది. నసీంషా కూడా ఎక్స్ ఫ్యాక్టర్ గా మారతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఇటీవల కాలంలో నసీం షా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతున్నాడు. అతడిని ప్రతిఘటించడానికి భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. గత ఏడాది వరకు షాహిన్ అఫ్రిది భారత బ్యాటర్లకు కఠినమైన సవాల్ విసిరేవాడు. అప్పట్లో అతడు పాకిస్తాన్ జట్టులో టాప్ బౌలర్ గా ఉండేవాడు. ఏకంగా 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు. బంతిని కూడా అద్భుతంగా స్వింగ్ చేసేవాడు. మోకాలి గాయం వల్ల అతడు తన పేస్ బలాన్ని కోల్పోయాడు. 135 కిలోమీటర్ల నుంచి వేగంగా బంతులు వేయలేకపోతున్నాడు. బంతి కూడా ఏమాత్రం స్వింగ్ కాలేకపోతోందని” అమీర్ వ్యాఖ్యానించాడు..

వాళ్ల పేర్లు చెప్పలేదు

పాకిస్తాన్ స్టార్ ప్లేయర్లుగా బాబర్ అజాం, షాహిన్ అఫ్రిది కొనసాగుతున్నారు. టీమ్ ఇండియాలో జరిగే మ్యాచ్లో స్టార్ ఆటగాళ్లుగా వారి పేర్లను అమీర్ చెప్పలేదు. ఇక 2017లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో అమీర్ మూడు కీలక వికెట్లు తీసి.. పాకిస్తాన్ జట్టుకు విజయం అందించాడు. అయితే ప్రస్తుతం అతడు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో పాకిస్తాన్ ఆడుతున్న మ్యాచ్లలో కామెంట్రీ చేస్తున్నాడు. త్వరలో జరిగే భారత్ పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ కోసం అతడు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగుతుందని అమీర్ అభిప్రాయపడుతున్నాడు. “రెండు జట్లు బలంగా ఉన్నాయి. ఐసీసీ నిర్వహించిన ఈవెంట్లలో ఇప్పటివరకు భారత జట్టు దేపై చేయి. కానీ 2017లో సీన్ రివర్స్ అయింది. అయితే ఈసారి భారత్ ప్రతీకారంతో ఆడుతుంది. పైగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20, వన్డే సిరీస్ ను భారత్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ దూకుడుగా ఆడే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. ఏది ఏమైనప్పటికీ దాయాదుల మధ్య పోరు అంటే ఎప్పటికీ ఆసక్తికరమేనని” అమీర్ వ్యాఖ్యానించాడు.