Manchu Vishnu
Manchu Vishnu : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో లెజెండ్స్ గా పిలవబడే అతి తక్కువ మంది హీరోలలో ఒకడు మంచు మోహన్ బాబు(Manchu Mohanbabu). ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మోహన్ బాబు, ఎన్నో కష్టాలు, ఒడిదుడుగులను ఎదురుకొని ఈ స్థాయిలో నిలబడ్డాడు. కెరీర్ ప్రారంభంలో విలన్ గా ఎన్నో వంద సినిమాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి, చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సమానంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టి, టాలీవుడ్ టాప్ 5 స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సంస్థ ని స్థాపించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. అదే విధంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్ ని స్థాపించి, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కాలేజీలను నెలకొల్పి దేశంలోనే వాటిని ఉన్నత స్థాయిలో నిలిపాడు.
ఇప్పుడు విద్యానికేతన్ విద్యాసంస్థలు యూనివర్సిటీ గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యూనివర్సిటీ ని ఇప్పుడు మంచు విష్ణు మైంటైన్ చేస్తున్నాడు. ఈ యూనివర్సిటీ కి సంబంధించిన ఆస్తి పంపకాల గురించే మనోజ్ ఇప్పుడు తన తండ్రి మోహన్ బాబు, అన్నయ్య విష్ణులతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) ని సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్(Rebelstar Prabhas) తో పాటు, అక్షయ్ కుమార్(Akshyay Kumar), మోహన్ లాల్(Mohan lal), శివ రాజ్ కుమార్ వంటి ఇతర భాషలకు చెందిన సూపర్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే కన్నప్ప మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘దేశవ్యాప్తంగా ఇప్పుడు బయోపిక్ సినిమాల హవా నడుస్తుంది కదా, మీ నాన్న గారి బయోపిక్ లో మీరు నటించే అవకాశం ఉందా’ అని అడగగా, దానికి విష్ణు సమాధానం ఇస్తూ ‘నాన్న గారి బయోపిక్ ని సినిమాగా తీయాలనే ఆలోచన అయితే నాకు ఉంది. కానీ అందులో నేను హీరో గా మాత్రం నటించను. నాన్న గారి పాత్రకు నేను న్యాయం చేయలేను. తమిళ సూపర్ స్టార్ సూర్య గారితో నాన్న గారి క్యారక్టర్ ని వెయ్యిస్తాను. నాన్న గారి బయోపిక్ ని సినిమాగా తీసేందుకు మంచి స్కోప్ ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంతటి స్థాయికి ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం ఎంతో అద్భుతమైనది’ అంటూ చెప్పుకొచ్చాడు.