https://oktelugu.com/

Pak Vs NZ: ఇదేం బ్యాటింగ్.. సూపర్ మ్యాన్ కూడా ముక్కున వేలేసుకుంటాడేమో? ..వీడియో వైరల్

ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ పాకిస్థాన్లో పర్యటిస్తోంది. మొదటి టి20 వర్షం వల్ల తుడిచి పెట్టుకుపోయింది. రెండవ టి20 లో పాకిస్తాన్ గెలిచింది. మూడు, నాలుగు మ్యాచ్ లలో న్యూజిలాండ్ విజయాన్ని దక్కించుకుంది.

Written By: , Updated On : April 28, 2024 / 09:03 AM IST
Pak Vs NZ

Pak Vs NZ

Follow us on

Pak Vs NZ: టీ -20 క్రికెట్ తెరపైకి వచ్చిన తర్వాత బ్యాటర్ల విన్యాసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బౌలర్ ఎలాంటి కఠినమైన బంతిని వేసినప్పటికీ బ్యాటర్లు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా బంతులను బలంగా బాదడానికే సిద్ధపడుతున్నారు. నేరుగా బౌండరీ దాటించేందుకు రెడీ అవుతున్నారు. పరుగుల వరద పారించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈక్రమంలో లయ కోల్పోయిన బౌలర్లు అప్పుడప్పుడు బంతులను వైడ్ లు వేస్తున్నారు. వాటిని కూడా వదలకుండా బ్యాటర్లు సూపర్ మ్యాన్ స్టంట్స్ చేస్తున్నారు. అలాంటి స్టంట్ ను న్యూజిలాండ్ బ్యాటర్ సిఫర్డ్ చేశాడు. పాకిస్తాన్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఐదవ టి20 మ్యాచ్లో అతడు ఈ విన్యాసం చేశాడు. పాకిస్తాన్ బౌలర్ అమీర్ వేసిన బంతి వైడ్ గా వెళ్తున్నప్పటికీ దానిని బలంగా కొట్టేందుకు ఏకంగా డైవ్ చేశాడు. నెట్టింట ఈ వీడియో హల్ చల్ సృష్టిస్తోంది.

ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ పాకిస్థాన్లో పర్యటిస్తోంది. మొదటి టి20 వర్షం వల్ల తుడిచి పెట్టుకుపోయింది. రెండవ టి20 లో పాకిస్తాన్ గెలిచింది. మూడు, నాలుగు మ్యాచ్ లలో న్యూజిలాండ్ విజయాన్ని దక్కించుకుంది. ఇక చివరిదైన టి20లో పాకిస్తాన్ గెలిచింది. సిరీస్ గెలిచే స్థాయి నుంచి.. సమం చేస్తే చాలు అన్నట్టుగా పాకిస్తాన్ ఆట తీరు సాగింది. నాలుగో టీ – 20 లో ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆర్మీ తో ట్రైనింగ్ ఇప్పించినా కూడా పాకిస్తాన్ ఆట తీరు మారలేదని సెటైర్లు వినిపించాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ చివరి t20 మ్యాచ్లో ఆట తీరు పూర్తిగా మార్చుకుంది.

చివరి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఐదు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజం 69 పరుగులు చేశాడు. ఫకార్ జమాన్ 43, ఉస్మాన్ ఖాన్ 31 రన్స్ తో అదరగొట్టారు. దీంతో పాకిస్తాన్ జట్టు 178 రన్స్ చేసింది. 179 టార్గెట్ చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 169 రన్స్ కు ఆలౌట్ అయింది. టిమ్ సిఫర్డ్ 52, క్లార్క్ 38, బ్రేస్ వెల్ 23 రన్స్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డు పురస్కారాలను షాహిన్ ఆఫ్రిది దక్కించుకున్నాడు.