Champions Trophy 2025 PAK vs NZ
Champions Trophy 2025 PAK vs NZ: ఏడు సంవత్సరాల అనంతరం icc ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తోంది. ఈసారి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఈ మెగా టోర్నీని జరుపుతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ – న్యూజిలాండ్ (PAK vs NZ) తలపడబోతున్నాయి. కరాచీలోని నేషనల్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఈ టోర్నీలో దిగుతోంది. మరోవైపు ఇటీవల పాకిస్తాన్ వేదికగా జరిగిన ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును ఓడించి సిరీస్ దక్కించుకుంది. దక్షిణాఫ్రికా జట్టును సైతం లీగ్ మ్యాచ్ లో ఓడించి న్యూజిలాండ్ అదరగొట్టింది. ట్రై సిరీస్లో పాకిస్తాన్ రెండుసార్లు న్యూజిలాండ్ చేతిలో భంగపాటుకు గురైంది. వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్ కీలక దశలో న్యూజిలాండ్ ఎదుట చేతులెత్తేసింది. దీంతో అందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న న్యూజిలాండ్ రెండుసార్లు పాకిస్తాన్ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీలోకి మెరుగైన ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. మరో పాకిస్తాన్ కూడా ట్రై సిరీస్ ఓటమిని పక్కనపెట్టి.. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో మైదానంలోకి అడుగుపెడుతోంది
29 సంవత్సరాల తర్వాత
29 సంవత్సరాల అనంతరం పాకిస్తాన్ జట్టు తన మొదటి ఐసీసీ టోర్నమెంట్ ను నిర్వహిస్తోంది.. మహమ్మద్ రిజ్వాన్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ జట్టు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టుకు టోర్నీ ప్రారంభానికి ముందే గాయాలు స్వాగతం పలికాయి. గాయం వల్ల లాకీ పెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బెన్ సియర్స్ కూడా అదే దారిని అనుసరించాడు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో గాయపడిన రచిన్ రవీంద్ర ఇంకా కోలుకోలేదు.. రెండు జట్లు ఇటీవల రెండు మ్యాచ్ లలో తలపడ్డాయి. అయితే రెండు మ్యాచ్లలోనూ న్యూజిలాండ్ విజయం సాధించింది. మెరుగైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ జట్టు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీనికి తోడు కీలక సమయాల్లో ఆటగాళ్లు చేతులెత్తేయడం పాకిస్తాన్ జట్టుకు వరుస ఓటములను నిర్దేశించింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ గత ఓటములను మరిచిపోయి చాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ఆట తీరు ప్రదర్శించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ హారీస్ రౌఫ్ జట్టులోకి వచ్చాడు. అతడు నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తూ కనిపించాడు.
మైదానం ఎలా ఉందంటే
పాకిస్తాన్, న్యూజిలాండ్ (pAK vs NZ)మ్యాచ్ కరాచీ నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 289. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు ఈ మైదానంపై దాదాపు 289 పరుగుల వరకు చేసే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ పెంచుకోవచ్చు.. 2023 నుంచి కరాచీ మైదానంలో 6 వన్డేలు జరిగాయి. అయితే ఈ మైదానంలో చివరి మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు, ముందుగా బౌలింగ్ చేసిన జట్టు వరుసగా మూడుసార్లు విజయం సాధించాయి.
జట్ల అంచనా
పాకిస్తాన్
ఫకర్ జమాన్, బాబర్ అజాం, కమ్రాన్ గులాం/ సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయబ్ తాహిర్, ఖుష్దీల్ షా, షాహిన్ అఫ్రిది, ఆబ్రార్ అహ్మద్, నసీంషా, హరీస్ రౌఫ్.
న్యూజిలాండ్
కైల్ జామిసన్, విల్ యంగ్, కాన్వే, కేన్ విలియమ్సన్, మిచెల్, లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్/ జాకబ్ డఫి, విల్ ఓరూర్కే.