Homeక్రీడలుక్రికెట్‌Rohith Sharma : ఓరయ్యా ఇదేం బౌలింగ్..నా కాళ్ళనే విరగొట్టేందుకు ప్రయత్నించావ్.. బౌలర్ పై రోహిత్...

Rohith Sharma : ఓరయ్యా ఇదేం బౌలింగ్..నా కాళ్ళనే విరగొట్టేందుకు ప్రయత్నించావ్.. బౌలర్ పై రోహిత్ చిందులు.. వైరల్ వీడియో

Rohith Sharma  : ఛాంపియన్స్ ట్రోఫీ (Champions trophy 2025) పాకిస్తాన్ వేదికగా రేపటి నుంచి మొదలుకానుంది. ఎనిమిది జట్లు ఈ ట్రోఫీ కోసం బరిలో ఉన్నాయి. భద్రత కారణాలు, రాజకీయ ఉద్రిక్తతల వల్ల టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచులు ఆడుతోంది. బీసీసీఐ విన్నపం మేరకు ఐసిసి టీమిండియా ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మోడ్ విధానంలో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్నారు..నెట్స్ లో విపరితంగా కష్టపడుతున్నారు. ఇటీవల నెట్స్ లో సాధన చేస్తుండగా హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి రిషబ్ పంత్ కు తగిలింది. ఆ తర్వాత రిషబ్ పంత్ ఒకరోజు అనంతరం కోలుకున్నాడు. ఇప్పటికే గాయం వల్ల బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ క్రమంలో గాయమైన రిషబ్ పంత్ కూడా ఈ టోర్నీకి దూరమవుతాడని అందరూ అనుకున్నారు. అయితే అదృష్టవశాత్తు అతడు ఆ గాయం నుంచి కోలుకొని.. పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించాడు. దీంతో టీం ఇండియా అభిమానులకు బిగ్ రిలీఫ్ లభించింది.

రోహిత్ శర్మ కాళ్లు విరగొట్టడానికి..

దుబాయ్ వేదికగా ఆడే మ్యాచ్లలో.. అద్భుతమైన ప్రతిభ చూపించాలని టీమిండియా భావిస్తోంది. ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న బౌలర్ అవాయిస్ అహ్మద్ బౌలింగ్లో అతడు ప్రాక్టీస్ చేశాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ ను అహ్మద్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.. ఈ స్పెషల్ మొత్తం పూర్తయిన తర్వాత రోహిత్ అతడని ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు. ” అరేయ్…ఏం బౌలింగ్ వేస్తున్నావ్ రా.. నువ్వు వేసే యార్కర్లు నా కాళ్ళు విరగ్గొట్టేలా ఉన్నాయి. బంతులు విపరీతమైన వేగంతో దూసుకు వచ్చాయి. అసలు ఆ బంతులను ఎలా ఆడాలో నాకు అర్థం కాలేదు. అసలు నీకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉందా? ఒకవేళ ఆ అనుభవం లేకుండా ఇలా బౌలింగ్ వేస్తున్నావంటే మామూలు విషయం కాదు.. భవిష్యత్తులో నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు కనిపిస్తాయి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. నువ్వు ప్రపంచ స్థాయి బౌలర్ అవుతావు. నీ ప్రతిభకు మరింత పదును పెట్టుకుంటే తిరుగులేని స్థాయిలో ఉంటావు. నీ బౌలింగ్ నాకు బాగా నచ్చింది. నీ బౌలింగ్లో ఆడాలంటే చాలా కష్టం అనిపించింది.. దుబాయ్ మైదానాలపై నా బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవడానికి నీ బౌలింగ్ ఉపకరించింది. గొప్ప బౌలింగ్లో ఆడినందుకు గర్వంగా ఉంది. గొప్పగా బౌలింగ్ వేస్తున్నావ్.. నీకు నా ధన్యవాదాలు” అంటూ రోహిత్ అవాయిస్ అహ్మద్ తో వ్యాఖ్యానిచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version