https://oktelugu.com/

Champions Trophy 2025: రేపే చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం.. డార్క్ హార్స్ ఎవరు? విజేతల రేసులో ఎవరు?

ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎనిమిది జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో ఫేవరెట్ జట్టు ఏది? ఏ జట్టు అంచనాలను సృష్టిస్తుంది? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Written By: , Updated On : February 18, 2025 / 10:20 PM IST
Champions Trophy 2025 (1)

Champions Trophy 2025 (1)

Follow us on

Champions Trophy 2025:  ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది. గ్రూపులో నాలుగు జట్లు, గ్రూప్ బి లో నాలుగు జట్లు ఉన్నాయి.. గ్రూపు ఏ లో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బి లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూపు ఏ లో పాకిస్తాన్ డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో రంగంలోకి దిగుతోంది. పైగా స్వదేశంలో టోర్నీ జరుగుతోంది. దీంతో పాకిస్తాన్ సెమీస్ వెళ్లడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.. మరోవైపు ఐసీసీ టోర్నీలు అనగానే అద్భుతంగా ఆడుతున్న భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ రెండు జట్ల కంటే న్యూజిలాండ్ కాస్త బలంగా ఉన్నట్టు ఇటీవల మ్యాచ్ ల ద్వారా తెలుస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో న్యూజిలాండ్ జట్టు బలంగా ఉంది. పైగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరిగిన ట్రై సిరీస్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ట్రై సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సంచలనం సృష్టించింది. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రత్యర్థులకు ప్రమాదకర సంకేతాలు పంపింది… న్యూజిలాండ్ జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఫామ్ లో ఉన్నాడు.. మిచెల్, కాన్వే, సాంట్నర్ అదరగొడుతున్నాడు. విలియంసన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల కరాచీ మైదానంలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. అదే మైదానంలో పాకిస్తాన్ జట్టుతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్ ఆడుతోంది. మరో పాకిస్తాన్ ఎక్కువగా కెప్టెన్ రిజ్వాన్, అఘా సల్మాన్ మీద ఆధారపడుతోంది. ఐసీసీ టోర్నీలలో టీమిండియా పై అదిరిపోయే రికార్డు న్యూజిలాండ్ జట్టుకుంది. మరోవైపు ఇంతవరకు దుబాయ్ మైదానాలలో టీమిండియా ఐసీసీ టోర్నీలు ఆడలేదు.

ఇక గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. ఐసీసీ టోర్నీలలో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడుతుంది. అందువల్లే ఆస్ట్రేలియా జట్టు 6 వన్డే ప్రపంచ కప్ లు, ఒక టి20 ప్రపంచ కప్, రెండు ఛాంపియన్స్ ట్రోఫీ లను దక్కించుకుంది. స్మిత్, హెడ్, జోష్, మెక్ గుర్క్ లబు షేన్, మాక్స్ వెల్ ఆస్ట్రేలియా జట్టుకు బలం.. కమిన్స్, హేజిల్ వుడ్, స్టార్క్ దూరం కావడం ఆ జట్టుకు ప్రధాన అవరోధం. ఆడం జంపా మాత్రమే ప్రధాన స్పిన్నర్ గా ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా 1-2 తేడాతో కోల్పోయింది.

ఇంగ్లాండ్ జట్టు బట్లర్, బ్రూక్, సాల్ట్, డకెట్, రూట్ వంటి ఆటగాళ్ల మీద ఆధారపడింది. ఆర్చర్, మార్క్ వుడ్ తమదైన రోజు అద్భుతాలు చేయగలరు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఆడలేక పోతున్నారు. అందువల్లే ఇటీవల భారత జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ను 0-3 తేడాతో కోల్పోయారు. చివరి ఓవర్లను వేయడానికి సరైన బౌలర్ లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పడుతోంది.

దక్షిణాఫ్రికా జట్టు లో బవుమా, క్లాసెన్, మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి వారు ఫామ్ లో ఉన్నారు.. రబాడ, ఎంగిడి, మార్కో జాన్సన్ జట్టులో ఉన్నారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్, షంసీ నిలకడగా రాణించడం లేదు. కీలక పేసర్ అన్రిచ్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.

ఇక ఆఫ్గనిస్తాన్ జట్టుకు బలమైన స్పిన్ బౌలింగ్ ఉంది. రషీద్ ఖాన్, నబి, నూర్ అహ్మద్, నంగేలియా వంటి వారు జట్టులో ఉన్నారు.. 2023 వన్డే ప్రపంచ కప్, 2024 t20 వరల్డ్ కప్ లో మేటి జట్లను ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు వన్డే ఫార్మాట్ కు సరైన సన్నద్ధత లేదు. ఆఫ్ఘనిస్తాన్ చివరిసారిగా గత ఏడాది డిసెంబర్లో వన్డే మ్యాచ్ ఆడింది.