పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు.. పాకిస్తాన్ ఆటగాడు కొట్టిన బంతిని అందుకునేందుకు ప్రయత్నించే క్రమంలో రవీంద్ర నుదుటికి బంతి బలంగా తగిలింది. బంతి బలంగా తగలడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో వైద్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనగా మారింది.. రవీంద్ర శరీరం నుంచి రక్తం తీవ్రంగా కారడంతో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే
పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైకేల్ బ్రేస్ వెల్ బౌలింగ్ వేసాడు. 37 ఓవర్లు మూడో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రేస్ వెల్ వేసిన బంతిని పాకిస్తాన్ ఆటగాడు కుష్ దిల్షా స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు.. అది స్లాగ్ స్వీప్ షాట్ గా గాల్లోకి లేచింది. అక్కడే రచిన్ రవీంద్ర ఫీల్డింగ్ చేస్తున్నాడు.. స్థలానికి ఆ బంతిని సులభంగా పట్టుకోవచ్చు. కానీ రవీంద్ర అందులో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతడి నుదుటికి తాకింది.. బంతి బలంగా తగలడంతో రచిన్ రవీంద్ర నేల కూలిపోయాడు. తీవ్రంగా రక్తస్రావం జరగడంతో అక్కడే పడిపోయాడు. వెంటనే వైద్యులు పరుగున అక్కడికి వచ్చారు. కర్చీఫ్ వేసి రక్త స్రావాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అతడిని పడుకోబెట్టి తీసుకువెళ్లడానికి పాకిస్తాన్ గ్రౌండ్ మేన్ స్ట్రెచర్ తీసుకొచ్చినప్పటికీ రవీంద్ర నడుచుకుంటూ మైదానం నుంచి వెళ్ళిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. రవీంద్ర కు జరిగిన గాయాన్ని చూసి అభిమానులు ఒక్కసారిగా టెన్షన్ పడిపోయారు… రవీంద్ర కు తీవ్ర గాయం కావడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్విఘ్న వాతావరణం నెలకొంది. మరికొందరేమో ఈ ఘటనను ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ ఉదంతంతో పోల్చి చూశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఈ ఘటన జరగడం న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రచిన్ రవీంద్ర ది భారతీయ మూలాలు ఉన్న కుటుంబం. రవీంద్ర చిన్నప్పుడే అతడి అమ్మానాన్నలు న్యూజిలాండ్ వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. రవీంద్ర తాతయ్య నానమ్మలది బెంగళూరు. ఐపీఎల్ ద్వారా రచిన్ రవీంద్ర భారత అభిమానులకు సుపరిచితుడు అయిపోయాడు. గత ఏడాది భారత్ వేదికగా భారత జట్టుతో జరిగిన మూడు టెస్టులలో రవీంద్ర అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో ఏకంగా సెంచరీ చేశాడు. ఒకరకంగా చూసుకుంటే బెంగళూరు అనేది అతడికి సొంత గడ్డ. రవీంద్ర కు తీవ్ర గాయం కావడంతో భారత అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ” అతడు యువ ఆటగాడు. అద్భుతమైన నైపుణ్యం ఉన్నవాడు. అటువంటి ఆటగాడికి ఇలా జరగడం బాధాకరం. అతడు త్వరగా కోలుకోవాలి. మా ప్రార్థనలు మొత్తం అతడు చుట్టూ ఉంటాయి. కచ్చితంగా అతడు తన పూర్వ శక్తిని సంపాదించుకోవాలి. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నామని” భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
A tough moment on the field for Rachin Ravindra as an attempted catch turned into an unfortunate injury.
Get well soon, Rachin! pic.twitter.com/34dB108tpF
— FanCode (@FanCode) February 8, 2025