Thandel Naga Chaitanya : అక్కినేని ఫ్యామిలీ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య (Naga Chaithanya) కెరియర్ మొదటి నుంచి కూడా చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన రీసెంట్ గా తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే తండేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య రీసెంట్ గా పోడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఇక అందులో ఆయన నెగెటివ్ పిఆర్ గురించి చాలా స్పష్టంగా తెలియజేశాడు. నిజానికి పిఆర్ టీం ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి రకరకాల ప్రమోషన్స్ ని పబ్లిసిటీ రూపంలో చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో కొంతమంది కావాలనే స్టార్ హీరోల సినిమాలకు నెగెటివ్ పిఆర్ చేస్తున్నారు అంటూ ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం ఇప్పుడు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక హీరో సినిమా వస్తే దానిమీద నెగెటివ్ గా రివ్యూ ఇప్పించడం. బ్యాడ్ కామెంట్లు చేయించడం లాంటివి పిఆర్ టీమ్ చేస్తున్నారు. ఇక దానివల్ల ఆ పిఆర్ టీం కి ఏం వస్తుంది. వాళ్ళ వెనుక కొంతమంది హీరోలు ప్రొడ్యూసర్లు ఉండి ఇలాంటి పనులు చేయిస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి నాగచైతన్య నెగెటివ్ పిఆర్ గురించి మాట్లాడటం అలాగే నెగెటివ్ పిఆర్ చేయించడం వల్ల వాళ్లకు వచ్చేది ఏంటి దానిమీద ఖర్చు పెట్టే డబ్బుతో ఒక హాలిడే ట్రిప్ కి వెళ్లి రావచ్చు కదా ఇతర హీరోల సినిమాలను నాశనం చేయడం వల్ల వాళ్లకు ఏమోస్తుంది అంటూ ఆయన చాలా ఘాటుగా మాట్లాడాడు.
మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచిగా మాట్లాడుకుంతున్న మన హీరోల మధ్య చన కుల్లు కుతంత్రాలు శత్రుత్వం అయితే ఉంటుందనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది. పైకి మాత్రమే వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ లోపల మొత్తం విషమే ఉంటుందనేది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.నిజానికి ఒక యూట్యూబర్ ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో డిబేట్ కి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు.
చాలా మంది హీరోల పిఆర్ లు మరొక హీరో సినిమా మీద నెగెటివ్ కామెంట్ చేస్తే డబ్బులు ఇస్తామంటూ థియేటర్ల ముందు ఓపెన్ గా చెబుతున్నారు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ ఆయన చెప్పిన మాటలు కొద్దిరోజుల క్రితం కలకలం రేపింది. ఇంకా ఇప్పుడు నాగ చైతన్య ఈ విషయం గురించి మాట్లాడటంతో ఈ విషయం మీద ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
A tough moment on the field for Rachin Ravindra as an attempted catch turned into an unfortunate injury.
Get well soon, Rachin! pic.twitter.com/34dB108tpF
— FanCode (@FanCode) February 8, 2025