ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఘోరంగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. 242పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా ఇంకా 45 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు జరిగాయో ఒక్కసారి తెలుసుకుందాం. పాకిస్తాన్ పెట్టిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ 100 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ చివరల్లో కోహ్లీ విన్నింగ్ ఫోర్ కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన కెరీర్లో 51వ సెంచరీని ఈ మ్యాచ్ లో పూర్తి చేసుకున్నాడు కోహ్లీ.
గ్రూప్ ఎలో భారత్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. వారితో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్ ముందు ఛాంపియన్స్ ట్రోఫీ పాయింట్ల పట్టికలో భారత్ రెండవ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌ను ఓడించడం ద్వారా భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత జట్టు వరుసగా రెండు మ్యాచులలో గెలిచింది.
వరుసగా రెండో ఓటమితో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాయింట్ల పట్టికలో అడుగున నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి దాదాపు నిష్క్రమించినట్లే. తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌ను ఓడిస్తే.. పాకిస్తాన్ అధికారికంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాయింట్ల పట్టిక (గ్రూప్ A)
1- భారత్
ఆడిన మ్యాచ్ లు – 2
గెలిచింది- 2
ఓడిపోయింది- 0
నికర రన్ రేటు- +0.647
పాయింట్లు – 4
2- న్యూజిలాండ్
ఆడిన మ్యాచ్ లు- 1
గెలిచింది- 1
ఓడిపోయింది- 0
నెట్ రన్ రేటు- +1.200
పాయింట్లు – 2
3-బంగ్లాదేశ్
ఆడిన మ్యాచ్ లు- 1
గెలిచింది- 0
ఓడిపోయింది- 1
నెట్ రన్ రేటు – -0.408
పాయింట్లు – 0
4- పాకిస్తాన్
ఆడిన మ్యాచ్ లు- 2
గెలిచింది- 0
ఓడిపోయింది- 2
నెట్ రన్ రేటు – -1.087
పాయింట్లు – 0
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాయింట్ల పట్టిక (గ్రూప్ బి)
1- దక్షిణాఫ్రికా
ఆడిన మ్యాచ్ లు- 1
గెలిచింది- 1
ఓడిపోయింది- 0
నెట్ రన్ రేటు – +2.140
పాయింట్లు – 2
2- ఆస్ట్రేలియా
ఆడిన మ్యాచ్ లు- 1
గెలిచింది- 1
ఓడిపోయింది- 0
నెట్ రన్ రేటు- +0.475
పాయింట్లు – 2
3- ఇంగ్లాండ్
ఆడిన మ్యాచ్ లు – 1
గెలిచింది- 0
ఓడిపోయింది- 1
నెట్ రన్ రేటు- -0.475
పాయింట్లు – 0
4- ఆఫ్ఘనిస్తాన్
ఆడిన మ్యాచ్ – 1
గెలిచింది- 0
ఓడిపోయింది- 1
నెట్ రన్ రేట్- -2.140
పాయింట్లు – 0