Jabardasth Varsha
Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష జెండర్ పై చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయి. ఆమె అబ్బాయా? అమ్మాయా? అనే సందేహం ఉంది. తోటి బుల్లితెర కమెడియన్స్ సైతం ఆమె జెండర్ మీద జోకులు వేస్తుంటారు. ఓ టాక్ షోలో పాల్గొన్న వర్ష దీనిపై క్లారిటీ ఇచ్చింది. సమాధానం చెప్పింది.
వర్షకు బుల్లితెర ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ వేదికగా ఆమె పాప్యులర్ అయ్యారు. వర్ష కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. పలు తెలుగు సీరియల్స్ లో ఆమె రోల్స్ చేశారు. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో జబర్దస్త్ కామెడీ షోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ షోకి ఉన్న ఆదరణ రీత్యా వర్ష అనతి కాలంలో ఫేమ్ రాబట్టింది. ఇంస్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ మరింతగా జనాలను ఆకర్షించింది.
కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ నడపడం కూడా వర్షకు ప్లస్ అయ్యింది. ఇమ్మానియేల్ అంటే తనకు ఎంతో ఇష్టమని వర్ష పలుమార్లు వెల్లడించింది. రష్మీ-సుడిగాలి సుధీర్ అనంతరం ఆ స్థాయిలో బుల్లితెర లవ్ బర్డ్స్ గా వర్ష, ఇమ్మానియేల్ పేరుగాంచారు. అయితే వర్ష జెండర్ పై అనుమానాలు ఉన్నాయి. తోటి కమెడియన్స్ ఆమెను లేడీ గెటప్ అంటూ ఉడికిస్తూ ఉంటారు. ఇమ్మానియేల్ సైతం ఒకటి రెండు షోలలో వర్ష జెండర్ పై జోక్స్ వేశాడు. ఇమ్మానియేల్ పై వర్ష కోప్పడింది కూడాను.
తాజాగా వర్ష ఒక టాక్ షోకి హాజరైంది. నటి సురేఖావాణి కూతురు సుప్రీత హోస్ట్ గా ఓ టాక్ షో ప్రసారం అవుతుంది. ఈ షోకి గెస్ట్స్ గా బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్, వర్ష హాజరయ్యారు. వర్షను సుప్రీత నేరుగా ఇంతకీ మీరు అమ్మాయా? అబ్బాయా? అని అడిగేసింది. ఈ ప్రశ్నకు సమాధానంగా.. నేను అమ్మాయిని కాదని ఒక పార్లర్ లోకి నన్ను రానీయలేదు. ఎంత డౌట్ ఉంటే ఆలా చేశారు, అని వర్ష అన్నారు. నేను అమ్మాయినే.. కానీ జనాలు అబ్బాయిని అని అపార్థం చేసుకుంటారు.. అనే మీనింగ్ లో వర్ష ఆన్సర్ ఉంది.
నేను అమ్మాయినే అని వర్ష పరోక్షంగా చెప్పింది. మరి ఆమె మాటల్లో నిజమెంతో తెలియదు. ఏదేమైనా ఇప్పుడు వర్ష బుల్లితెర స్టార్. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాప్యులర్ కామెడీ షోలలో వర్ష సందడి చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో కూడా వర్షకు భారీ ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు.
Web Title: Jabardasth varsha made interesting comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com