PAK : ఆ డైలాగు మాదిరిగానే ఉంటుంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆట తీరు. బ్యాటింగ్ బాగోదు. బౌలింగ్ వల్ల కాదు. ఫీల్డింగ్ కూడా చేతకాదు. వరుస ఓటములు ఎదురైనా.. ఇంటా బయటా పరువు పోయినా పాకిస్తాన్ తీరు మారడం లేదు. ఆ జట్టును ఉద్దేశించి ఆ దేశానికి చెందిన మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా.. ఆటతీరు మార్చుకోవాలని చెబుతున్నా ఏమాత్రం మారడం లేదు. పైగా రోజురోజుకు మరింత నాసిరకంగా పాకిస్తాన్ జట్టు క్రికెట్ ఆడుతోంది. వన్డేలలో చేతులెత్తేస్తోంది.. టెస్టులలోనూ తల వంచుతోంది. టి20 లలోనూ నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. అసలు క్రికెట్ ఎందుకు ఆడుతోంది అనే ప్రశ్నను సగటు అభిమాని నుంచి ఎదుర్కొంటున్నది పాకిస్తాన్ క్రికెట్ జట్టు..
సింగిల్ రన్ కు బదులుగా మూడు పరుగులు ఇచ్చారు..
అంతర్జాతీయ క్రికెట్ విషయాని కాస్త పక్కన పెడితే.. గల్లీ క్రికెట్లో కూడా సింగిల్ రన్ వచ్చే చోట ఎవరూ మూడు పరుగులు ఇవ్వరు. అలా ఇవ్వాలని కూడా ఎవరూ కోరుకోరు. కానీ పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల స్టైల్ వేరు కదా.. ఒకరి మధ్య ఒకరికి అవగాహన ఉండదు కదా.. అందుకే ఒక్క పరుగు వచ్చే చోట మూడు పరుగులు ఇచ్చారు. అంతేకాదు ఫీల్డింగ్ లో అత్యంత చెత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఇటీవల పాకిస్తాన్ జట్టు టి20, వన్డే సిరీస్ లు ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్ళింది. దానికంటే ముందు పాకిస్తాన్ వేదికగా దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ దేశాలు ట్రై సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించారు. ఈ ట్రోఫీలో పాకిస్తాన్ అయితే గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. ఇలా రెండు వరుస ఓటములు ఏదైనా తర్వాత పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ వెళ్లిపోయింది. అక్కడ 5 t20 లు, మూడు వన్డేలు ఆడింది. ఐదు టి 20 మ్యాచ్ల సీరీస్ లో 1-4 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇక 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ లో 0-3 తేడాతో దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది. అయితే ఓ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. అది న్యూజిలాండ్ బ్యాటింగ్ తీరుకు అద్దం పట్టగా.. పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్ కు దర్పణంగా నిలిచింది. పాకిస్తాన్ బౌలర్ బంతివేయగా.. న్యూజిలాండ్ బ్యాటర్ దానిని మిడ్ ఆన్ లో ఆడాడు. సింగిల్ రన్ తీశాడు. మిడ్ ఆన్ లో ఉన్న పాకిస్తాన్ ఫీల్డర్ ఆ బంతిని వికెట్ల వైపుగా విసిరాడు.. అది కాస్త మిస్ ఫీల్డ్ అయింది.. ఇంకేముంది న్యూజిలాండ్ బ్యాటర్లు మరో సింగిల్ తీశారు. ఆ తర్వాత ఆ బంతిని మరో ఫీల్డర్ వికెట్ల వైపు విసిరేశాడు.. ఈసారి కూడా సేమ్ సీన్.. సో మొత్తంగా ఒక్క పరుగు రావాల్సిన చోట మూడు రన్స్ వచ్చాయి. అంతేకాదు పాకిస్తాన్ ప్లేయర్ల ఫీల్డింగ్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఇక పాకిస్తాన్ నెటిజన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ జట్టు ఆటగాళ్ల ఆట తీరు చూసి.. నెత్తి నోరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అది కూడా సోషల్ మీడియాలో.. వారు పెడుతున్న బొబ్బలు చూసి.. భారతీయులు నవ్వుకున్నారని వేరే చెప్పాల్సిన పనిలేదు అనుకుంటా.
BEHIND EVERY SUCCESSFUL BATTER, THERE IS PAKISTAN’S FIELDING #PAKvNZ pic.twitter.com/NMeq03Sb2r
— Richard Kettleborough (@RichKettle07) April 5, 2025